Belly Fat : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తీసుకుంటే.. నెల రోజుల్లోనే పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..

Belly Fat : మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అధిక బ‌రువు వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని వేధిస్తుంది.

దీని కార‌ణంగా ర‌క్త‌పోటు, షుగ‌ర్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌డం చాలా అవ‌స‌రం. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. సుల‌భంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వల్ల చాలా త్వ‌ర‌గా , చాలా సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం గోరు వెచ్చ‌ని నీటిని, బేకింగ్ సోడాను, నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ ముప్పావు వంతు గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి.

Belly Fat reducing tips in telugu take this daily
Belly Fat

త‌రువాత అందులో పావు టీ స్పూన్ బేంకిగ్ సోడాను, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న అన‌గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఈ విధంగా ఈ పానీయాన్ని నెల‌రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రుగుతుంది. దీంతో మ‌నం బ‌రువు త‌గ్గాతాము. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. పొట్ట చుట్టూ అలాగే ఇత‌ర శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డుతున్న‌వారు ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వల్ల ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాం.

D

Recent Posts