Black Raisins : పురుషులు వీటిని రోజూ గుప్పెడు తింటే చాలు.. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Black Raisins : నేటి త‌రుణంలో చాలా మంది పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అనేక ర‌కాల కార‌ణాల చేత ఈ స‌మ‌స్య తలెత్తుంది. దీంతో చాలా మంది పురుషుల్లో సంతాన‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీంతో వైవాహిక జీవితం విచ్చినం అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. అలాగే ఈ స‌మ‌స్య కార‌ణంగా ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు కూడా గురి అవుతూ ఉంటారు.

దీంతో ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను, సప్లిమెంట్స్ ను వాడుతున్నారు. ఇలా మందుల‌కు బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ఎండుద్రాక్ష‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు వివిధ రంగుల్లో ఇవి ల‌భిస్తూ ఉంటాయి. ఎండుద్రాక్ష‌లో ప్రోటీన్స్, ఐర‌న్, ఫైబ‌ర్, కాప‌ర్, పొటాషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Black Raisins amazing benefits must take daily
Black Raisins

అంతేకాకుండా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వీర్య క‌ణాల నాణ్య‌త‌తో పాటు లైంగిక సంబంధిత స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయని వారు చెబుతున్నారు. పురుషులు ఎండుద్రాక్ష‌ను తీసుకోవ‌డం వ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు శరీరం కూడా బ‌లంగా త‌యార‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి స‌మస్య‌తో బాధ‌ప‌డే పురుషులు ఈ ఎండుద్రాక్ష‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లైంగిక స‌మ‌స్య‌ల‌తో బాద‌ప‌డే పురుషులు రోజూ 10 నుండి 12 ఎండుద్రాక్ష‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి. ఉద‌యం వీలుకాని వారు ఈ ఎండుద్రాక్ష‌ల‌ను పాల‌ల్లో ఉడికించి రాత్రినిద్ర పోవ‌డానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల‌తో పాటు వాటి నాణ్య‌త కూడా పెరుగుతుంద‌ని అలాగే సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts