Brown Rice Payasam : నేటి తరుణంలో మనలో చాలా మంది రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేక నీరసం, బలహీనత, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే మతిమరుపు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు మనకు సులభంగా లభించే పదార్థాలతో పాయసాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలను తగ్గించే ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పాయసాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం బ్రౌన్ రైస్ ను, డ్రై ఫ్రూట్స్ ను, నెయ్యిని, సబ్జా గింజలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కప్పు బ్రౌన్ రైస్ ను జార్ లో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ రవ్వను నెయ్యి వేసి వేయించాలి. ఈ రవ్వను కుక్కర్ లో వేసి 5 కప్పుల పాలు, కొద్దిగా పటిక బెల్లం వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక మరో 5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో మరో రెండు కప్పుల పాలు, 2 స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు, యాలకుల పొడి, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన పాయసాన్ని రోజూ ఒక కప్పు మోతాదులో ప్రతిరోజూ ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఇలా తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా పాయసాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా బ్రౌన్ రైస్ తో పాయసాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.