Cinnamon Water For Weight Loss : దాల్చిన చెక్క నీళ్ల‌ను తాగితే అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా..?

Cinnamon Water For Weight Loss : మ‌నం వంటల్లో వాడే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క‌ ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌నను క‌లిగి ఉంటుంది. వీటిని వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దాల్చిన‌చెక్క‌ వేయ‌డం వ‌ల్ల వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించ‌డంతో పాటు దాల్చిన చెక్క మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్క థ‌ర్మోజెనిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది.

శ‌రీరంలో వేడి పెరుగుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. క‌నుక మనం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి త‌గ్గుతుంది. జంక్ ఫుడ్, బ‌యట ఆహారాల‌ను తీసుకోవాల‌నే కోరిక త‌గ్గుతుంది. దీంతో మ‌న శ‌రీరంలోకి అద‌నంగా క్యాల‌రీలు వెళ్ల‌కుండా ఉంటాయి.

Cinnamon Water For Weight Loss how it works perfectly
Cinnamon Water For Weight Loss

అదే విధంగా జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా దాల్చిన చెక్క నీరు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరం పోష‌కాల‌ను గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ లక్ష‌ణాలు కూడా అధికంగా ఉంటాయి. కనుక దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క‌ణాల‌ల్లో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. ఫ్రీరాడికల్స్ కార‌ణంగా శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా కాపాడ‌డంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల నీటిని ఎక్కువ‌గా తాగాల‌నే కోరిక క‌లుగుతుంది. దీంతో శ‌రీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే ఎక్కువ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ దాల్చిన చెక్క నీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వేడి నీటిలో దాల్చిన చెక్క పొడిని, పుదీనా ఆకులు వేసి ఉంచాలి. ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి త‌రువాత వ‌డ‌క‌ట్టి నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌చ్చు అలాగే నీటిలో దాల్చిన చెక్క వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ఈ నీటిని వ‌డ‌క‌ట్టి నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా దాల్చిన చెక్క నీటిని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా కాపాడుకోవ‌చ్చు.

D

Recent Posts