Diabetes : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడి అనేక మంది రోజూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కింద తెలిపిన మూడు ఆహారాలను రోజూ కచ్చితంగా తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయను రోజూ తినాలి. రోజూ దీన్ని తినలేమని అనుకుంటే ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో జ్యూస్ తాగాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. రోజూ కాకరకాయ రసం తాగితే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
2. షుగర్‌ను అదుపు చేయడంలో మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. రాత్రి పూట 2 టీస్పూన్ల మెంతులను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగి ఆ మెంతులను తినేయాలి. లేదంటే ఆ నీటిని అలాగే 5 నిమిషాల పాటు మరిగించి కూడా తీసుకోవచ్చు. అలాగే మెంతి ఆకు లభిస్తుంది. దీన్ని కూడా రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్ ను తగ్గించడంలో మెంతి అద్భుతంగా పనిచేస్తుంది.
3. ఇక చివరిగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ తీసుకోవాల్సిన ఆహారాల్లో ఉసిరికాయ రసం ఒకటి. దీన్ని కూడా పరగడుపునే 30 ఎంఎల్ చొప్పున తాగుతుండాలి. దీంతో ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్‌ను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.