Ear Pain : చెవి నొప్పి నుండి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!

Ear Pain : చెవి నొప్పి ముఖ్యంగా పిల్లలలో వ‌స్తుంటుంది. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా సంభవించవచ్చు. ఈ నొప్పి ఒక చెవి లేదా రెండు చెవులలో ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది ఒక చెవిలోనే వ‌స్తుంది. చెవి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల నొప్ప వ‌స్తుంది. నొప్పితో పాటు జ్వరం, వికారం, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే చెవి నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవేమిటంటే..

Ear Pain home remedies

1. చెవి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఆలివ్ నూనె సహాయపడుతుంది. దీని కోసం 3 లేదా 4 చుక్కల గోరువెచ్చని ఆలివ్ నూనెను చెవిలో వేసి 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. త‌రువాత‌ తలని కిందికి వంచి నూనెను తీసేయండి. కొన్ని రోజుల‌పాటు ప్రతి రోజూ ఒకసారి ఇలా చేయండి. ప్రత్యామ్నాయంగా మీరు 2 లేదా 3 చుక్కల టీ ట్రీ ఆయిల్, 4 నుండి 6 డ్రాప్స్ వెచ్చని ఆలివ్ ఆయిల్ క‌లిపి వాడ‌వ‌చ్చు. ఈ మిశ్రమాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా చెవి నొప్పి త‌గ్గుతుంది.

2. వెల్లుల్లిలో అనాల్జేసిక్, యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి. చెవి ఇన్ఫెక్షన్, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని చిన్న ముక్కలుగా క‌ట్ చేయాలి. త‌రువాత వాటిని ఆలివ్ నూనె లేదా ఆవ నూనెలో వేసి వేడి చేయాలి. అనంత‌రం చ‌ల్లార్చి ఆ నూనెను సేక‌రించాలి. దాన్ని చెవిలో 2 లేదా 3 చుక్కలు వేయాలి. దీంతో చెవి నొప్పి త‌గ్గుతుంది.

3. చెవి నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్‌ను త‌గ్గించేందుకు ఉల్లిపాయ‌ల ర‌సం కూడా బాగానే ప‌నిచేస్తుంది. దాన్ని కూడా చెవిలో 2, 3 చుక్క‌లు వేస్తూ ఉంటే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts