హార్ట్ ఎటాక్‌లు ఎలా వస్తాయి ? రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగితే అప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. నేటి తరుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు కూడా. ఈ క్రమంలో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికి బట్ట కట్టినా తరువాత ఇది రాదని చెప్పలేం. జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు ఇచ్చే మందులను వాడాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అయితే దీంతోపాటు కింద సూచించిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసుకుని తాగితే హార్ట్ ఎటాక్ ఇక మీకు మళ్లీ జన్మలో రాదు. సాధారణ ఆరోగ్యవంతులు కూడా ఈ డ్రింక్‌ను తాగవచ్చు. దీంతో భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
కావల్సిన పదార్థాలు… వెల్లుల్లి రెబ్బలు – 30, నిమ్మకాయలు – 6. తయారీ విధానం… నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టుతీసి ముక్కలుగా కోయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని వాటిని మిక్సీ పట్టాలి. బాగా మిక్స్ అయ్యాక అందులో రెండు లీటర్ల నీళ్లు పోసుకోవాలి. తర్వాత వచ్చే మిశ్రమాన్ని 5-6 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ నుంచి దించేసి వడకట్టాలి. ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపర్చి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
పైన చెప్పిన మిశ్రమాన్ని ఇలా వాడాలి…
ప్రతీ రోజూ ఈ మిశ్రమాన్ని 50ఎంఎల్ చొప్పున ఉదయం పరగడుపున తాగాలి. ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తిరిగి వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ కావాలంటే ఇంకో మూడు వారాలు తీసుకోవచ్చు. ఇలా 6 నెలలకు ఓసారి చేయవచ్చు. దీంతో గుండె జబ్బులు అనేవి రానే రావు. గుండెకు పంప్ చేసే రక్త నాళాల్లో కొవ్వు కరిగిపోయి అవి ఫ్రీగా అవుతాయి. దీంతో వాటిల్లో రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యవంతులు కూడా ఈ మిశ్రమాన్ని రోజూ వాడితే వారికి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. నిజానికి కొలెస్ట్రాల్‌ను కరిగించే, గుండె సంబంధ సమస్యలను నయం చేసే అనేక మెడిసిన్లలో నిమ్మరసం, వెల్లుల్లిలలోని కెమికల్స్‌నే వాడుతారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. కనుక ఈ రెండు పదార్థాలతో తయారు చేసే ఆ మిశ్రమాన్ని తాగితే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.