Drinking Water : ఆరోగ్యానికి నీళ్లు ఎంత అవసరం అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే, ఎలా పోషకాహారాన్ని తీసుకుంటామో అలానే నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. అయితే నీళ్లు తాగడానికి కూడా పద్ధతి ఉంటుంది. నీళ్లు ఎలా తాగితే మంచిది, ఎలా తాగకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మంచినీళ్ళని తాగేటప్పుడు నిలబడి అస్సలు తాగకండి.
నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదు. ఉదయం ఖాళీ కడుపు తో ఒక లీటర్ వరకు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి ఇది చాలా మంచి అలవాటు. భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. ఈ అలవాటు కనుక మీకు లేకపోతే కచ్చితంగా అలవాటు చేసుకోండి. అప్పుడు మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది.
భోజనంతో పాటు కానీ భోజనం తిన్న వెంటనే కానీ అసలు నీళ్లు తీసుకోవద్దు. వ్యాయామం తర్వాత నీళ్లు తప్పకుండా తాగాలి. నీళ్లు తాగేటప్పుడు, నెమ్మదిగా కొంచెం కొంచెం తాగాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకండి. నిద్ర పోవడానికి, స్నానం చేయడానికి అరగంట ముందు మాత్రమే నీళ్లు తాగండి. రోజు రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగారంటే గుండె పోటు రాకుండా ఉంటుంది.
ఇక ఏ వయసు వాళ్ళు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలని చూస్తే… 1 నుండి 8 సంవత్సరాల పిల్లలు అర లీటర్ నీళ్లు తీసుకోవాలి. 9 నుండి 18 సంవత్సరాల వాళ్ళు రెండు లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. 18 ఆ పై వాళ్లు రోజుకి మూడు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. తక్కువ నీళ్లు మీరు తాగుతున్నట్లయితే, ఈ రోజే నీళ్లు తాగడం మొదలు పెట్టండి.