ఆధ్యాత్మికం

Shiva Abhishekam : శివుడికి ఈ పనులు చేస్తే చాలు.. కోరిన కోరికలు తీరుతాయి..!

Shiva Abhishekam : ప్రతి సోమవారం భక్తులు శివున్ని పూజిస్తారన్న సంగతి తెలిసిందే. ఆయన భోళా శంకరుడు. అంటే అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇస్తుంటాడు. కనుకనే శివున్ని భక్తులు అధికంగా పూజిస్తుంటారు. అయితే కొన్ని రకాల పనులను చేయడం వల్ల శివుడు మిక్కిలి సంతృప్తి చెందుతాడట. దీంతో కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మరి శివుడి కోసం చేయాల్సిన ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

ప్రతి సోమవారం ఇంట్లో ఉన్న శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. అభిషేకం చేసే సమయంలో శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా 21 రోజుల పాటు చేయాలి. దీంతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివుని చిత్రపటంలో శివుడి కంఠాన్ని చూస్తూ శ్రీ నీలకంఠాయనమః అని జపిస్తూ పూజ చేయాలి. ఇలా 21 సోమవారాల పాటు చేయాలి. దీంతో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. శివలింగానికి ప్రతి సోమవారం పాలాభిషేకం చేస్తూ శ్రీ మహాదేవాయ నమః అని జపించాలి. అనంతరం మూడు బిల్వ దళాలను సమర్పించాలి. దీంతో సంపదకు సంబంధించిన కోరికలు నెరవేరుతాయి.

do these works to lord shiva to fulfill wishes

శివున్ని పార్వతీ సమేతంగా మనసులో ధ్యానిస్తూ లేదా వారి చిత్ర పటాన్ని చూస్తూ శ్రీ గౌరీప్రియాయ నమః అని జపించాలి. ఇలా చేస్తుంటే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో అభివృద్ధి చెందుతారు. శివలింగానికి ప్రతి సోమవారం నెయ్యితో అభిషేకం చేస్తూ శ్రీ మృత్యంజయాయ నమః అని జపించాలి. ఇలా 21 సోమవారాలు చేయాలి. దీంతో ఎలాంటి భయంకరమైన రోగాలు అయినా సరే తొలగిపోతాయి.

శివుడికి దీపం వెలిగించి ఆ దీపంలో వెలుగుతున్న ఆ తేజస్సును పరమేశ్వరుడి స్వరూపంగా భావించి శ్రీ పరమేశ్వరాయ నమః అని 1008 సార్లు జపిస్తూ 41 రోజుల పాటు దీక్ష చేయాలి. దీంతో అసాధ్యం అనుకునే పనులు కూడా సాధ్యపడతాయి. ఇలా శివుడిని పూజించడం వల్ల అనుకున్నవి నెరవేరుతాయి.

Admin

Recent Posts