Health Benifits : పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పెరుగులో వుండే బ్యాక్టీరియా మన పొట్టలోని పేగులను ఆరోగ్యంగా వుంచుతాయి. ఈ బ్యాక్టీరియా మన జీర్ణక్రియ ప్రక్రియ మంచిగా జరిగేలా చేస్తుంది. పెరుగులో విలువైన పోషకాలు వుంటాయి. పెరుగులో వుండే కాల్షియం, మన ఎముకలను గట్టిపడేలా చేస్తాయి. కొంతమంది పెరుగులో చక్కెర వేసుకొని తాగుతుంటారు. ఇలా తాగితే మన బాడీకి అధిక మొత్తంలో ఎనర్జి లెవల్స్ పెరుగుతాయి. అందుకే పెరుగును రోజు తినాలని వైద్యులు చెప్తున్నారు . అయితే పెరుగు తిన్న వెంటనే ఇవి తినకూడదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . పెరుగు తిన్న వెంటనే ఆయిల్ లో వేయించిన ఆహార పదార్ధాలను అస్సలు తినరాదు.
దీనివలన తిన్న భోజనం అరగదు .అజీర్తి ,గ్యాస్ ట్రబుల్ మొదలగు సమస్యలు వస్తాయి .అందుకే తిన్న వెంటనే ఆయిల్ ఫుడ్స్ తినకూడదు . కొంతమందికి పెరుగులో ఆనియన్స్ వేసుకొని తినడం ఇష్టం .ఇలా తినడం మంచిది అనుకుంటారు . ఉల్లిపాయ ఏమో బాడీలో వేడిని పెంచుతుంది ,పెరుగేమో మన శరీరాన్ని చల్లబరుస్తుంది . ఇవి రెండు కలిపి తింటే గ్యాస్ ట్రబుల్ ,వాంతులు ,ఎలర్జీలు వచ్చేఅవకాశం ఉంటుంది .ఇంకా పెరుగు తిన్న తరువాత మినపప్పుతో చేసిన పిండి వంటకాలు తినకూడదు . దీనివలన ఆకలి మందగించి మలబద్ధకం తయారవుతుంది . కొంతమంది పెరుగులో మామిడికాయను వేసుకొని తింటారు. అలా తింటే ఎలర్జీ ,అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే మామిడికాయ వేడి కాబట్టి ఇవి రెండు కలిపి తినకూడదు.
అలాగే పెరుగన్నం తిన్నాక వెంటనే పాలు తాగకూడదు . అలా తాగితే అజీర్తి ,అతిసారం ,కడుపునొప్పి మొదలగు అనారోగ్య సమస్యలు వస్తాయి . అలాగే చేపల కూర తిన్నాక పెరుగు వేసుకొని తినకూడదు . ఎందుకంటే ఈ రెండింటిలోనూ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి.అందువలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది . కాబట్టి పెరుగు తిన్న వెంటనే ఈ ఆరు ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండటమే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు . ఈ వేసవి కాలం ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే పెరుగును ఖచ్చితంగా తినాలి . ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది . పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో వుండే బాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది . పెరుగును రోజు తింటే మన బాడీ శారీరకంగానూ ,మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటుందని వైద్య శాస్ర నిపుణులు అంటున్నారు.