Jonna laddu Recipe : జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పీచు పదార్ధం,ప్రోటిన్స్ ఎక్కువగా వుంటాయి. అయితే మనం ఎక్కువగా ఇంట్లో జొన్నరొట్టెలనే చేసుకుంటాం. వీటిని పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అయితే ఈ జొన్నరొట్టెలకు కొద్దిగా స్వీట్ ను జోడిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.ఆ విధంగానైనా పిల్లలు జొన్నపిండి లడ్డులను తింటారు. వీటిని ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావలసిన పదార్దాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు: 1)నెయ్యి 2)జొన్నపిండి 3)యాలకులు 4)జీడిపప్పు 5)బెల్లం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, పెనం పెట్టి, అందులో 3 టేబుల్ స్ఫూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు జొన్నపిండి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి.అందులో దంచిన యాలకులను, నేతిలో వేయించుకున్న జీడిపప్పులను వేసుకొని బాగా కలుపుకోవాలి.
మళ్లీ ఇందులో మూడు స్ఫూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా వస్తాయి లడ్డూలు. ఇప్పుడు తరిగిన పెట్టుకున్న ఒక కప్పు బెల్లంను వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే ఎంతో టేస్టీ, టేస్టీ జొన్నలడ్డూలు రెడీ…మీకు ఏమైన డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి..