Chanakya Niti : మన భారతదేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. ఈయన 371BC బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడు ఎంతో గొప్పవాడు,బుద్ధి బలం కలవాడు. రాజనీతి శాస్త్రాన్ని రచించాడు. ఆయన కాలంలోని నాణెముల విలువను ఇప్పటి వారికి తెలియజేసాడు. ఆయన రచించిన నీతిశాస్త్రంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.ముఖ్యంగా చాణక్యుడు ఈ ఏడుగురిని బాధించడం వలన మనకు అనేక సమస్యలు వస్తాయని చెప్పారు. అవి ఏంటో తెలుసుకుందాం..
1)పసి పిల్లలు భగవంతుడితో సమానం. అట్టి పిల్లలను బాధిస్తే పాపం కలుగుతుంది.కాబట్టి ఎప్పుడైనా పసి పిల్లలను ఏడిపించవద్దు.
2)మనం ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్న బ్రాహ్మణుడు కావాలి. వారు లేకపోతే ఏ కార్యం చేయలేము.అలాగే మన ఇంట్లో ఎవరైన చనిపోతే కర్మకాండలు నిర్వహించేది కూడా బ్రాహ్మణులే. అట్టి వారిని అవమానించరాదు, కించపరచరాదు.
3)మనకు చదువుని బోధించేవాడు గురువు. అలాగే క్రమశిక్షణ, తోటి వారితో ఎలా మెలగాలి అని నేర్పించే గురువుని ఎప్పుడు అవమానించరాదు.
4)హిందు ధర్మంలో అగ్నికి ఎంతో ప్రాధాన్యత వుంది. అట్టి అగ్నిని అనవసరంగా వుపయోగించడం , ఆటలాడడం చేయరాదు. అలాగే ఏ శుభకార్యమైనా ముందుగా దీపం వెలిగించాలి. కనుక అగ్నిని మంచిగా ఉపయోగించాలి.చెడుగా ఉపయోగిస్తే నష్టాలపాలవుతారు.
5)మన హిందువులు గోమాతను దేవతామూర్తిగా భావిస్తారు. అట్టి గోమాతను పూజించాలి కాని హింసించరాదు.