హెల్త్ టిప్స్

కాటన్ శ్వాబ్ తో చెవులు క్లీన్ చేసుకోవద్దు.. బదులుగా ఇలా క్లీన్ చేయండి..!

చాలా మంది చెవులను క్లీన్ చేసుకోవడానికి కాటన్స్ శ్వాబ్ ని ఉపయోగిస్తారు. చెవులలో కాటన్ శ్వాబ్ పెట్టి క్లీన్ చేసుకోవడం కాస్త ప్రమాదకరమని చెప్పొచ్చు. కాటన్స్ శ్వాబ్ తో చెవులను క్లీన్ చేసుకోవడం వలన చెవులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెవు పైన ఉండే ఓ లేయర్ దెబ్బతింటుంది. అయితే మరి చెవులని ఎలా క్లీన్ చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చేస్తే.. చెవులను క్లీన్ చేసుకోవడానికి మీరు మంచి క్లాత్ ని ఉపయోగించవచ్చు.

ఒక క్లాత్ తీసుకుని వేడి నీళ్లలో ఆ క్లాత్ ని ముంచి, ఒకసారి పిండేసి దానితో చెవి పైన అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా వస్తువుని చెవుల లోపల పెట్టి క్లీన్ చేసుకోవడం ప్రమాదకరమని గుర్తుపెట్టుకోండి. కాటన్ శ్వాబ్ వంటి వాటిని ఉపయోగించకూడదు. ఒకవేళ కనుక సరిగా క్లీన్ అవ్వలేదు అని మీరు అనుకున్నట్లయితే ఇయర్ డ్రాప్స్ ని ఉపయోగించండి.

do not use cotton swab for ear cleaning

ఇయర్ డ్రాప్స్ ద్వారా చెవులని క్లీన్ చేసుకోవచ్చు. ఇయర్ డ్రాప్స్ ని వాడడం వలన ఈజీగా చెవులు క్లీన్ అయిపోతాయి. ఒకవేళ కనుక బాగా ఎఫెక్ట్ అయినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది. ఎప్పటికప్పుడు చెవులని క్లీన్ చేసుకోవడం మంచిది. అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వలన చెవి ఇన్ఫెక్షన్స్ వంటిది రాకుండా ఉంటాయి.

Peddinti Sravya

Recent Posts