హెల్త్ టిప్స్

వేప‌నూనె మ‌న‌కు ఎన్ని ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతుందో తెలుసా..?

ఆయుర్వేద విజ్ఞానం మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద. ప్రకృతిలో సహజంగా దొరికే ఉత్పత్తులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మంచి పద్దతి. ఐతే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఆయుర్వేద వస్తువులు దొరుకుతున్నాయి. అందం గురించి గానీ, శారీరక ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి గానీ, ఇంకా మానసిక ఆరోగ్యం కోసం చాలా రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ మనకి లభ్యం అవుతున్నాయి. ఐతే ప్రకృతిలో దొరికే వేపాకు తైలం వలన కలిగే ప్రయోజనాలని ఈ రోజు తెలుసుకుందాం. వేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ సమస్యల నుండి కాపాడుకోవడానికి వేపాకు చాలా ఉపయోగపడుతుంది. ఐతే వేపాకు తైలం గురిచి మాట్లాడుకుంటే, ముఖ్యంగా మూడు రకాల సమస్యల నుండి కాపాడుతుంది.

1) చర్మ సమస్యలు, 2) జుట్టు సమస్యలు, 3) క్రిమి సంహారిణిగా.. ప‌నిచేస్తుంది. చర్మ సమస్యలు.. చర్మంపై నల్లమచ్చలు బాధిస్తున్నాయంటే, వేపనూనె తీసుకుని దాన్ని నీటితో కలుపుకుని ఆ నల్లమచ్చలపై రాయాలి. క్రమం తప్పకుండా రోజూ ఇలా చేస్తూ ఉంటే నల్లమచ్చలు మాయం అవుతాయి. ఫేస్ ప్యాక్ లో వేపనూనె వాడండి. దీని వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. చర్మం దురదగా ఉంటే వేపనూనెతో పాటు కొంచెం నువ్వుల నూనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసుకుంటే దురద నుండి బయటపడవచ్చు.

do you know in how many ways we can use neem oil

జుట్టు సమస్యలు.. తలలో చుండ్రు, పేలు బాధపెడుతుంటే వేపాకు తైలం వాడటం ఉత్తమం. ఈ తైలం చుండ్రుని పోగొట్టి పేలని చంపేస్తుంది. ఇంకా జుట్టు బాగా పెరగడానికి పనిచేస్తుంది. ఎండిపోయినట్టుగా ఉన్న జుట్టుని సిల్కీగా చేయడంలో వేపాకు తైలం సరిగ్గా పనిచేస్తుంది. ఐతే వేపాకు తైలాన్ని డైరెక్ట్ గా అప్లే చేయకుండా దానిలో కొంచెం కొబ్బరినూనె కలుపుకోవడం మంచిది.

క్రిమిసంహారిణి.. దోమలు, పురుగులని సంహరించడానికి వేపాకు తైలం బాగా ఉపయోగపడుతుంది.

Admin

Recent Posts