హెల్త్ టిప్స్

Gangavalli : దీన్ని చాలా మంది పిచ్చి మొక్క అనుకుంటారు.. దీన్ని చూస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Gangavalli : నిత్యం మనం ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం. కానీ ఆ మొక్కలలో ఉన్న ఔషధ గుణాలు చాలా వరకు తెలియదు. అవి పిచ్చి మొక్కలు అనుకోని వాటిని పీకి పడేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క ఆ కోవకు చెందిందే. గంగవల్లి కూర మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు.. ఈ మొక్క వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయ‌ని చాలా మందికి తెలియక పోవచ్చు. పిచ్చి మొక్క అనుకొనే గంగవల్లి కూరలో దాగి ఉన్న ఔషధ గుణాలు.. వాటి ప్రయోజనాలు గురించి తెలిస్తే ఇంక ఎప్పుడూ దాన్ని వదిలిపెట్ట‌రు.

ఈ మొక్కలు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకు కూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా వీటిని ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ మొక్కను మీ పెరటిలో ఒక్కసారి నాటుకుంటే చాలా సులభంగా పెరిగిపోతుంది. ఈ గంగవల్లి ఆకులలో సమృద్ధిగా విటమిన్ ఎ లభిస్తుంది. విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

gangavalli aku many wonderful health benefits

ఈ ఆకుకు శరీరంలోని విష పదార్థాలను దూరం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. ఎముకలు బలంగా ఉండడానికి సహకరిస్తాయి. అనేక రకాల ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఏ ఆకు కూరలు లేని ఒమెగా-3 ఆమ్లాలు గంగవల్లి ఆకుకూరలో ఎక్కువగా ఉంటాయి. క‌నుక ఈ ఆకు కూరను తినడం ద్వారా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. గంగవల్లి కూర కాండం, ఆకులలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.

ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అన్ని రక్త కణాలకు ఆక్సిజన్ అందేలా చేస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ కూరలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వలన శరీరం అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. విటమిన్ సి చర్మ రక్తనాళాలు సక్రమంగా ఉంచడానికి దోహదపడుతుంది. గాయాలు అయిన చోట గంగవల్లి ఆకుల రసాన్ని రాసి కట్టుకడితే త్వరగా మానిపోయేలా చేస్తుంది. క‌నుక ఇంకెప్పుడైనా ఈ ఆకుకూర క‌నిపిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి. అస‌లు విడిచిపెట్ట‌కండి.

Admin

Recent Posts