హెల్త్ టిప్స్

Curry Leaves : క‌రివేపాకును అసలు ఎలా ఉప‌యోగిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves : కూర, సాంబార్ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా..? అదేనండీ కరివేపాకు! ఆ.. అయితే ఏంటి..? అని కరివేపాకును అలా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది.

దీంతోపాటు డయాబెటిస్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది. ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కమిలిన గాయాలకు, దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి. పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది.

how to use curry leaves powder

కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా, లేదా వాటి జ్యూస్ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది.

కరివేపాకుల పొడిని కూరలు, సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

Admin

Recent Posts