Mushrooms : మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమైన పౌష్టికాహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. కూరగాయలు, పండ్లలో లభించని పోషకాలు వీటిల్లో ఉంటాయి. అందువల్ల వీటిని తరచూ తినాలి. ఈ సీజన్‌లో మనకు సహజంగానే పుట్ట గొడుగులు ఎక్కువగా లభిస్తాయి. అయితే బయట మార్కెట్‌లో మనకు ఏడాది పొడవునా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనెయిన్, గ్లూటాథియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వృద్ధాప్య ఛాయలను రానివ్వవు. అందువల్ల యవ్వనంగా కనిపిస్తారు.
2. పుట్ట గొడుగులను తినడం వల్ల అల్జీమర్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
3. గుండె ఆరోగ్యానికి పుట్ట గొడుగులు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో గ్లూటమేట్ రైబోన్యూక్లియోటైడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బీపీని అదుపు చేస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటియి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుందని తెలిసిందే. అయితే విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు చాలా మందికి డాక్టర్లు విటమిన్ డి ట్యాబ్లెట్లను రాస్తుంటారు. కానీ పుట్ట గొడుగులను తరచూ తీసుకోవడం వల్ల విటమిన్ డి బాగా లభిస్తుంది. దీంతో విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు. ఆ లోపం ఉన్నవారు తరచూ పుట్ట గొడుగులను తీసుకోవాలి.
5. పుట్ట గొడుగుల్లో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. రైబోఫ్లేవిన్, ఫోలేట్, థయామిన్, పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. నీరసంగా, అలసటగా ఉందని భావించే వారు పుట్ట గొడుగులను తింటే ప్రయోజనం ఉంటుంది.
6. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే గుణాలు కూడా పుట్టగొడుగుల్లో ఉంటాయి. వీటిని తినడం వల్ల ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.
7. పుట్ట గొడుగులను తినడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
8. ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉన్నవారు పుట్ట గొడుగులను తింటుంటే ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
9. పుట్ట గొడుగుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి.