చలికాలంతోపాటు వర్షాకాలంలోనూ సైనస్ సమస్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జలుబు కూడా వస్తుంటుంది. ఈ రెండు సమస్యలు ఉంటే ఒక పట్టాన తగ్గవు. అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆసనాలను వేయడం వల్ల ఆ రెండు సమస్యలను వెంటనే తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే..
నిటారుగా నిలబడి కిందకు వంగి చేతులతో పాదాలను తాకాలి. ఆరంభంలో కష్టంగా ఉంటే మోకాళ్లను కొద్దిగా వంచవచ్చు. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. మళ్లీ లేచి నిలబడాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి.
నేలపై నిటారుగా కూర్చుని మోకాళ్లను వంచి వెనక్కి తేవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి. ఇలా 3 సార్లు చేయాలి.
ఇది వజ్రాసనంలో ఒక భాగమే కాకపోతే నిటారుగా ఉన్నవారు అలాగే వెనక్కి వెల్లకిలా పడుకోవాలి. అరచేతులను మోకాళ్ల మీద నుంచి తీసి పాదాల పక్కన పెట్టాలి. ఇలా కూడా 30 సెకన్ల పాటు ఉండాలి. దీన్ని కూడా 3 సార్లు చేయాలి.
దీన్ని ఆరంభంలో కొందరు చేసేందుకు కష్టమవుతుంది. కానీ సాధన చేస్తే దీన్ని వేయడం సులభమే. ఈ ఆసనంలో తలను కిందకు కాళ్లను పైకి పెట్టాలి. నడుముకు అరచేతులను పెట్టి సపోర్ట్‌ను ఇవ్వాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండేందుకు ప్రయత్నించాలి. 3 సార్లు చేయాలి.
మోకాళ్ల మీద కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచి తలను కొద్దిగా పైకెత్తాలి. చేతులను పైకి లేపి నిటారుగా ఉంచాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. 3 సార్లు చేయాలి.
ఈ ఆసనాలను రోజూ వేయడం వల్ల సైనస్, జలుబు సమస్యలు తగ్గుతాయి.