నారింజ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు నారింజ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే ఈ పండ్లే కాదు, వీటి తొక్కల వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నారింజ పండు తొక్కల్లో హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది బీపీని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
2. నారింజ పండు తొక్కల్లో ఉండే సమ్మేళనాలు అలర్జీలను తగ్గిస్తాయి. పలు రకాల మందులను వాడడం వల్ల వచ్చే అలర్జీలను తగ్గించుకోవచ్చు.
3. నారింజ పండు తొక్కల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ రాకుండా ఆపవచ్చు.
4. అధిక బరువు తగ్గాలనుకునేవారికి నారింజ పండు తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు.
5. నారింజ పండు తొక్కల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. విరేచనాలు, గుండెల్లో మంట, అసిడిటీ తగ్గుతాయి.
ఇవే కాకుండా నారింజ పండు తొక్కల వల్ల హ్యాంగోవర్, నోటి దుర్వాసన, దగ్గు, జలుబు, ఫ్లూ, చర్మ సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే నారింజ పండు తొక్కల వల్ల లాభాలు ఉన్నాయి సరే కానీ వాటిని తినాలా ? ఎలా తీసుకోవాలి ? అనే చాలా మందికి సందేహాలు కలుగుతాయి. అయితే వాటిని తినాల్సిన పనిలేదు. వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365