Heart Health : ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలో కెల్లా గుండె ప్రధానమైనది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వారి ఆహారంలో తప్పకుండా పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల గుండె అనారోగ్యానికి గురి అవుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర, కొవ్వులను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక లవణం కారణంగా రక్తపోటు పెరిగి గుండె పని తీవ్రత పెరుగుతుంది.
ఉప్పు ద్వారా సోడియం మోతాదు ఎక్కువైతే గుండె వైఫల్యం వంటి విపరీత సమస్యలు ఎదురవుతాయి. మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కువగా ఉండే శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే తక్కువ మోతాదులో చక్కెరను తీసుకోవడం ప్రమాదకరమే కాదు. కానీ సోడాలో ఒక రోజుకు తీసుకోవాల్సిన దాని కంటే కూడా ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. దీని వల్ల అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కుక్కీస్, కేక్స్, మఫిన్స్ వంటివి తీసుకోవడం తగ్గించాలి. అందులో ఉండే అదనపు చక్కెర బరువు పెరిగేలా చేస్తుంది. వీటి తయారీలో వాడే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఈ ప్రమాదం నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. గోధుమపిండిని వాడుతూ చక్కెరను తగ్గించాలి. శుద్ధి చేసిన ధాన్యాలు శరీరంలో చక్కెరలుగా మారతాయి. అవి శరీరంలో కొవ్వులా స్థిరపడిపోతాయి. ఈ ధాన్యాల వల్ల బొడ్డు చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఇది గుండె జబ్బు, టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తాయి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ పిండి తీసుకోవడం మంచిది. అదే విధంగా తక్కువ మోతాదులో అల్కాహాల్ తీసుకోవడం గుండెకు హానికరం కాకపోవచ్చు. కానీ రక్తపోటు, హై ట్రై గ్లిజరాయిడ్స్, ఒకరకమైన కొవ్వు రక్తంలో ఉంటే ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే మంచిది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్ లలో లభించే పదార్థాలు అధికంగా కొవ్వును, ఉప్పును కలిగి ఉంటాయి. ఇది గుండెకు చాలా ప్రమాదకరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిలగడ దుంపను ఫ్రై చేసుకుని తినాలి. సూప్ ను తాగడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, పోషకాలు సులభంగా లభిస్తాయి. అయితే ఈ సూప్ తయారీకి వాడే ముడి పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి ఆహారాలకు దూరంగా ఉంటూ తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, చేపల ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.