Baby Corn Butter Masala Recipe : బేబీకార్న్ బ‌ట‌ర్ మ‌సాలా.. రోటీలు, పులావ్‌లోకి చ‌క్క‌ని కాంబినేష‌న్‌..

Baby Corn Butter Masala Recipe : బేబీకార్న్ అంటే మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. మొక్క‌జొన్న‌కు చెందిన పంట ఇది. కాక‌పోతే కంకులు చిన్న‌గా ఉంటాయి. కానీ వీటిని మొక్క‌జొన్న‌లా ఎండ‌బెట్ట‌రు. కూర‌గాయ‌లా వండుకుంటారు. ఈ క్ర‌మంలోనే బేబీకార్న్ ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న‌పాటి మొక్క‌జొన్న కంకుల్లా ఉండే ఇవి ఎంతో క‌మ్మ‌నైన రుచిని అందిస్తాయి. అందుక‌నే కూర‌ల్లా చేసుకుని తింటుంటారు. ఇక బేబీకార్న్‌తో చేసే వంట‌కాల్లో బేబీకార్న్ బ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. దీన్ని చ‌పాతీలు లేదా రోటీల్లో తింటారు. భ‌లే రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బేబీ కార్న్ బ‌ట‌ర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బేబీ కార్న్ – అర కిలో, ట‌మాటాలు – మూడు, కారం – ఒక టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – ఒక టీస్పూన్‌, క్రీమ్ – పావు క‌ప్పు, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – త‌గినంత‌, మెంతి ఆకులు – కొద్దిగా, నూనె – స‌రిప‌డా, ఉల్లిపాయ – ఒక‌టి, అల్లం – చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – నాలుగైదు, జీడిప‌ప్పు – నాలుగైదు ప‌లుకులు.

Baby Corn Butter Masala Recipe in telugu easy to make
Baby Corn Butter Masala Recipe

బేబీ కార్న్ బ‌ట‌ర్ మ‌సాలాను త‌యారు చేసే విధానం..

ముందుగా ఉల్లిపాయ‌, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, జీడిప‌ప్పు ప‌లుకుల‌ను మిక్సీలో వేసి మెత్త‌ని పేస్టుగా త‌యారు చేసుకోవాలి. అవ‌స‌రం అయితే కొన్ని నీళ్లు క‌లుపుకోవాలి. స్ట‌వ్‌పై పాన్ పెట్టి వెన్న వేయాలి. కాస్త వేడి అయ్యాక బేబీ కార్న్ వేసి ప‌ది నిమిషాల పాటు వేయించాలి. కార్న్ బాగా వేగిన త‌రువాత ఒక పాత్ర‌లోకి తీసుకోవాలి. త‌రువాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి మిక్సీలో వేసి ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసి వేయించాలి. జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి ఒక క‌ప్పు నీళ్లు పోసి చిన్న‌మంట‌పై ఉడికించాలి. బ‌ట‌ర్ మ‌సాలా చిక్క‌బ‌డిన త‌రువాత క్రీమ్ వేయాలి. త‌గినంత ఉప్పు వేసుకోవాలి. త‌రువాత వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి మ‌రో 10 నిమిషాల పాటు వేగ‌నివ్వాలి. చివ‌ర‌గా మెంతి ఆకులు చ‌ల్లుకుని దింపుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన బేబీ కార్న్ బ‌ట‌ర్ మ‌సాలా రెడీ అవుతుంది. దీన్ని రోటీలు, చ‌పాతీల‌తోపాటు పులావ్‌తోనూ తిన‌వ‌చ్చు. లేదా బ్రెడ్‌తోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Share
Editor

Recent Posts