హెల్త్ టిప్స్

మీరు రోజూ తాగే టీ, కాఫీల‌లో చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లం క‌లిపి చూడండి..!

బెల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం ముక్క తింటే నిత్యం యవ్వనంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. బెల్లం తినడం వల్ల రక్త హీనత సమస్య నుండి బయట పడొచ్చు. ఇలా అనేక సమస్యలని బెల్లంతో తరిమి కొట్టేయొచ్చు. మరి ఇప్పుడే దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుని… సులువుగా సమస్యల నుండి బయట పడిపోండి. ప్రతి రోజూ బెల్లం ముక్క తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. బెల్లం నోటికి తీపిని అందించడం తో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడుతుంది.

ఐరన్ తో పాటు మినరల్స్‌ కూడా బెల్లం లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే బెల్లం ఖచ్చితం గా తీసుకోవడం ఎంతో మంచిది. చక్కెర తో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తక్కువ చక్కెరని ఉపయోగించి, ఎక్కువ బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. రక్త హీనత సమస్య నుండి బయట పడాలన్నా కూడా క్రమం తప్ప కుండ బెల్లం తినాలి.

here it is what happens if you add jaggery to your tea or coffee

జలుబుగా ఉన్నపుడు ఒక ముక్క బెల్లం తిని గోరువెచ్చటి నీరు తాగడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. అలానే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా బెల్లం ఉపయోగ పడుతుంది. జుట్టు ఎక్కువగా రాలే సమస్య నుంచి కొంత అయినా బయట పడాలంటే రోజూ బెల్లం ముక్క తినడం ఉత్తమం. చర్మం పై ముడతలను, ముఖం పై ఏర్పడే మచ్చలను కూడా బెల్లంతో పోగొట్టచ్చు. పాలు , టీ, కాఫీ ల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి.

Admin

Recent Posts