హెల్త్ టిప్స్

వారంలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది..?

ఆరోగ్యంగా ఉండాలంటే దంప‌తులు త‌ర‌చూ శృంగారంలో పాల్గొనాల‌ని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో వారానికి ఒక‌సారి శృంగారంలో పాల్గొన‌డ‌మే చాలా క‌ష్టంగా మారింది. ఎల్ల‌ప్పుడూ టెన్ష‌న్లు, ఒత్తిళ్ల‌తో చాలా మంది జీవితాల‌ను నెట్టుకొస్తున్నారు. అయితే వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య‌క‌రం అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే.. వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వారు చెబుతున్నారు. ఇలా శృంగారంలో పాల్గొంటే శ‌రీరంలో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయ‌ని అంటున్నారు.

ఈ విధంగా హార్మోన్లు రిలీజ్ అవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని వారు అంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. డిప్రెష‌న్ నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తుంటి వ‌ద్ద కండ‌రాలు, ఎముక‌లు ప‌టిష్టంగా మారుతాయి. దీంతో వృద్ధాప్యంలో ఎముక‌లు సుల‌భంగా విరిగిపోకుండా ఉంటాయి. అలాగే ఆయుర్దాయం పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

how many times per week sex is healthy

ఇక వ‌య‌స్సును బ‌ట్టి కూడా వారం వారం శృంగారంలో పాల్గొనే సంఖ్య మారుతుంద‌ని వారు అంటున్నారు. 20 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు వారైతే వారానికి 3 నుంచి 5 సార్ల వ‌ర‌కు శృంగారంలో పాల్గొనాల‌ట‌. అదే 30-40 ఏళ్ల వారు వారంలో 2 నుంచి 4 సార్లు, 40 నుంచి 50 మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు వారంలో 1 నుంచి 3 సార్లు, 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారు కూడా వారానికి 1 నుంచి 2 సార్లు శృంగారంలో పాల్గొనాల‌ని అంటున్నారు. దీంతో ఎంతోకాలం ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

అయితే కొంద‌రు నెల‌కు ఒక‌సారి అదీ కుదిరితేనే శృంగారంలో పాల్గొంటున్నారు. ఇలా చేస్తే శ‌రీరంపై తీవ్ర ప్రభావం ప‌డుతుంద‌ట‌. దీంతో ఒత్తిడి స్థాయిలు విప‌రీతంగా పెరిగి డిప్రెష‌న్ బారిన ప‌డ‌తారు. దంప‌తుల మధ్య క‌ల‌హాలు వ‌చ్చే చాన్స్ ఉంటుంది. శృంగారంపై క్ర‌మంగా ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది. ఇక మ‌రీ అతిగా శృంగారం చేస్తే.. జ‌న‌నావ‌య‌వాలు మంట పెట్ట‌డం, దుర‌ద‌లు రావ‌డం, వాపుల‌కు గురి కావ‌డం, ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డ‌డం, హార్మోన్లు బ్యాలెన్స్ త‌ప్ప‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక శృంగారాన్ని కూడా మితంగానే చేయాలి. అవ‌స‌రం ఉన్నంత మేర చేస్తే ఆనందంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts