టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్రెండ్ కు తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు.. వీరు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ చాలా మందికి కార్ల వరకే తెలుసు.. కానీ మన స్టార్ హీరోలకు కార్లు, బంగ్లా లే కాకుండా సొంత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. మరి ఏ హీరోకు ఎలాంటి జెట్ విమానం ఉందో మనం ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి కుటుంబానికి ఒక ప్రైవేటు విమానం ఉంది. కానీ దీన్ని ఎక్కువగా రామ్ చరణ్ ఉపయోగిస్తారట.. ఆయన ఈ జెట్లో వేకెషన్ వెళుతుంటారు. గతంలో నిహారిక మ్యారేజ్ కోసం ఉదయపూర్ కు ఈ జెట్ లోనే వెళ్లారు.
అల్లు అర్జున్ కు కూడా ఒక సొంత ప్రైవేట్ విమానం ఉందట. తన ఫ్యామిలీతో కలిసి ఎటైనా దూర జర్నీ చేసినప్పుడు దీంట్లో వెళ్తారని అందరికీ తెలుసు. అక్కినేని ఫ్యామిలీకి కూడా ఒక సొంత విమానం ఉందట… నాగచైతన్య, అఖిల్, నాగార్జున కలిసి కొన్ని సందర్భాల్లో ఈ విమానంలో ప్రయాణించారు. పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కూడా ఒక సొంత విమానం కొన్నారు. బాహుబలి సినిమా తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయన ఆ విమానంలో ప్రయాణిస్తున్న దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఉంది. ఈయన కూడా ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లైట్ వాడతారట.. ఆయన ప్రయాణం చేస్తున్న ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ప్రైవేట్ జెట్ విమానం ఉంది. దీని విలువ 80 కోట్ల వరకు ఉందని టాక్. దీన్ని ఎమర్జెన్సీ సమయంలోనే వాడతారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ప్రైవేట్ జట్ కొనుగోలు చేశారట. ఈ మధ్య ఆయన అందులో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.