హెల్త్ టిప్స్

Green Tea : రోజూ గ్రీన్ టీని తాగుతున్నారా.. అయితే ముందు వీటిని తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగిన‌ జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరూ హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. కానీ గ్రీన్ టీ మీరు అనుకునేంత బెస్ట్ ఏం కాదు. దాని వలన కూడా నష్టాలున్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీని అధికంగా తాగ‌డం వ‌ల్ల అనేక అన‌ర్థాలు క‌లుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అనీమియా.. అనగా రక్తహీనత. గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ లోపం వ‌స్తుంది. దీంతో అనీమియా వచ్చే అవకాశముంటుంది. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ వ‌ల్ల శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకోలేదు. అయితే ప‌రిమిత మోతాదులో గ్రీన్ టీ అయితే ఓకే. కానీ మోతాదుకు మించితే టానిన్స్ ఎక్కువ‌వుతాయి. దీంతో ఐర‌న్‌ను శ‌రీరం గ్ర‌హించ‌లేదు. ఫ‌లితంగా ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. క‌నుక గ్రీన్ టీని మోతాదులో మాత్రమే సేవించాల్సి ఉంటుంది. గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్ లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది. సాధార‌ణ హార్ట్ బీట్ మారితే చాలా కష్టం. క‌నుక గ్రీన్ టీని త‌క్కువ‌గా తీసుకోవాలి.

if you are drinking green tea then know this

గ్రీన్ టీలో కెఫీన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా కడుపునొప్పి, కడుపులో మంట లాంటివి కలుగుతాయి. మన శరీరం 9.9 గ్రాముల గ్రీన్ టీనే తీసుకునే శక్తి కలిగి ఉంటుంది. దీని పరిమాణం పెరిగితే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి. తలనొప్పి వాటిల్లో ఒకటి. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ దీని వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశలెక్కువ. దీనికి కారణం దీనిలో ఉండే కాటచిన్స్. గ్రీన్ టీ మూలంగా కళ్లపైన ఒత్తిడి కూడా ఎక్కువ పడే అవకాశముంది. అంతేకాదు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎలర్జీలు వచ్చే అవకాశముంది.

ముఖం, నాలుక, గొంతు, పెదాలు.. త‌దిత‌ర‌ ప్రాంతాల్లో దురదలా అనిపించొచ్చు. క‌నుక గ్రీన్ టీని అధికంగా సేవించ‌రాదు. రోజుకు 1 లేదా 2 క‌ప్పులు మాత్ర‌మే తీసుకోవాలి. అంత‌కు మించితే పైన తెలిపిన స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక గ్రీన్ టీని రోజూ తాగుతున్న వారు ఈ విష‌యంలో మాత్రం క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే. లేదంటే అన‌ర్థాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Admin

Recent Posts