హెల్త్ టిప్స్

Lemon Water : నిమ్మ‌కాయ నీళ్ల‌ను రోజూ తాగుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Lemon Water : ఆరోగ్యానికి నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ వలన అనేక లాభాలని పొందొచ్చు. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. నిమ్మని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది నిమ్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందని పదే పదే నిమ్మ రసం తాగుతూ ఉంటారు. మీరు కూడా నిమ్మరసాన్ని రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోండి.

రోజూ నిమ్మరసం తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కలుగుతాయి. రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకున్నట్లయితే ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ గా నిమ్మ రసాన్ని తీసుకోవడం వలన దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. దంత క్షయం ఏర్పడుతుంది. నిమ్మ రసంలో ఉండే యాసిడ్ దంతాలని దెబ్బతీస్తుంది. ఇలా నిమ్మ వలన అనేక సమస్యలు కలుగుతాయి.

if you are drinking lemon water daily then know these

నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండెలో మంట వస్తుంది. అలాగే వికారం వంటి సమస్యలు కలుగుతాయి. నిమ్మకాయల‌లో యాసిడ్ ఉండడం ఇందుకు కారణం. నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వలన కడుపునొప్పి వంటి సమస్యలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా నిమ్మరసం తీసుకోవడం వలన యూరిన్ ఎక్కువగా వస్తుంది. అదే విధంగా నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఎముకల సమస్యలు కూడా వస్తాయి.

నిమ్మకాయలోని ఆమ్లగుణం ఎముకలకు హాని చేస్తుంది. ఐరన్ శోషణని నిమ్మ పెంచుతుంది. నోటి పూత వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవద్దు. రోజూ ఎక్కువ‌గా తీసుకుంటే ఇలా అనేక సమస్యలు వస్తాయి. ఏ ఆహార పదార్థాలను కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు. ఏ ఆహార పదార్దాన్నైనా సరే లిమిట్ గానే తీసుకోవాలి. లిమిట్ దాటి తీసుకున్నట్లయితే నష్టాలే ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అధిక మోతాదులో ఏ ఆహార పదార్థాన్ని తీసుకోవద్దు.

Admin

Recent Posts