హెల్త్ టిప్స్

బాగా అల‌సిపోయిన‌ట్లు అవుతున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

నాణ్యమైన జీవనం కలిగి వుండాలంటే శక్తి, ఆనందం కావాలి. వీటిని పొందాలంటే కొన్ని మ్యాజిక్ ఆహారాలను సూచిస్తున్నాం. పరిశీలించండి. అధ్భుత శక్తినిచ్చే 3 ఆహారాలు. ఓట్స్ – అలసి పోయినట్లు, నీరసపడ్డట్లు భావిస్తూంటే, దేనిపైనా ఆసక్తి చూపకపోతే, మీ శరీరంలో కొన్ని బి విటమిన్లు లోపించాయని చెప్పాలి. ఈ విటమిన్లు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికే కాక కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి ఇంధనం చేకూరుస్తాయి.

ఉదయం వేళలో ఒక కప్పుడు ఓట్స్ తింటే అవసరమైన బి విటమిన్ శరీరానికి చేకూరుతుంది. చాక్లెట్ – డార్క్ చాక్లెట్ లో గుండెకు శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అవి మీ మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

if you are getting fatigue follow these tips

బీట్ రూట్ – బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాదు అధికమైన తక్షణ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇందులో షుగర్ అధికంగా వుండి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, నైట్రేట్ వంటివి కూడా వుంటాయి. బీట్ రూట్ ఏ రూపంలో తిన్నప్పటికి ఆరోగ్యమే.

Admin

Recent Posts