సిగరెట్ తాగుతున్నారా? ఇటువంటి వారికి స్మోకింగ్ పూర్తిగా వదిలివేయమనేది మొదటి సలహా. అయితే, ఎంత ప్రయత్నించినా ఈ దురలవాటును వదలలేకుండా వున్నారా? మీ శరీరం ఈ అలవాటుకు బానిసైపోయిందా? మరి అలాగయితే, సిగరెట్ తాగితే వుండే చెడు ప్రభావాలనుండి బయటపడటానికి కొన్ని మార్గాలు చూడండి. గ్రీన్ టీ – సాధారణ కాఫీ, టీలు తాగే వారయితే వాటిని మానేసి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే గ్రీన్ టీ తాగండి. ఇది సిగరెట్ చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
వెల్లుల్లి – మీరు తినే ప్రతిదానికి సలాడ్లు, సూప్ లు, కూరలు అన్నిటికి వెల్లుల్లి వాడకం చేయండి. వెల్లుల్లికి కడుపులో ఏర్పడే పుండ్లు తగ్గించే స్వభావం వుంది. పచ్చటి కూరలు – తినే కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే పచ్చటి కూరలు ఎక్కువగా తినండి. సిగరెట్ తాగితే వచ్చే కేన్సర్ వ్యాధి రాకుండా అరికడతాయి. గోంగూర, తోటకూర, పాలకూర, బ్రక్కోలి వంటివి తప్పక మీ మెను లో వుంచండి.
కేప్సికం – కేప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కేన్సర్ రోగులకు రికవరీ డైట్ గా ఇది సూచిస్తారు. అతిగా వేయించకుండా ఒక మాదిరి పచ్చిగా తింటే మంచి ఫలితాలనిస్తుంది. సిట్రస్ జాతి పండ్లు – విటమిన్ సి బాగా వున్న సిట్రస్ జాతి నిమ్మ, ఆరెంజ్, మెలన్, టమాటా వంటివి మీరు సిగరెట్ తో పొందే వ్యాధులు నయం చేసే గుణం వుంది. ఈ చిట్కాలు పాటించి సిగరెట్ తాగడాన్ని మానేయవచ్చు.