హెల్త్ టిప్స్

టాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !

అనారోగ్యం వచ్చినప్పుడో.. బీపీ,షుగర్ వంటి వ్యాధులు ఉన్నప్పుడో టాబ్లెట్లు వేసుకోవడం తప్పదు. నలభయ్యేళ్లు రాక ముందే చాలామంది రోజూ మూడు, నాలుగు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక థైరాయిడ్ వంటి సమస్య ఉన్నవారు రోజూ పొద్దున్నే టాబ్లెట్ వేసుకోవాల్సిందే.

అధిక రక్తపోటు, హృద్రోగం, నొప్పులకు మందులు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే టాబ్లెట్లు వేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మొదటిది బాగా నీరు తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అంశంపై కెనడాకు చెందిన వాటర్లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు.

if you are swallowing tablets then know this

వేరు వేరు రోగాల కోసం రోజూ మందులు వేసుకునేవారు తగినంత నీరు తాగకపోతే మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తేల్చారు. రోజూ వేసుకునే టాబ్లెట్ల కారణంగా మూత్ర పిండాలకు హాని ఉందంటున్నారు నిపుణులు. నీటిని అధికంగా తాగడం వల్ల ఈ ప్రమాదం కొంత మేర తగ్గుతుందట. అధిక రక్తపోటు బాధితులకు వాటర్ పిల్, హార్మోనల్ వ్యవస్థను నియంత్రించే ఔషధాలను వైద్యులు సూచిస్తుంటారు.

వీటితో పాటు చాలామంది ఆసిన్ మాత్రనూ తీసుకుంటుంటారు. ఈ మూడింటి కారణంగా
మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయట. దీనికి తోడు శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే… ఉన్న నీటితోనే మూత్రం ద్వారా మలినాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలు ప్రయత్నిస్తాయి. దీంతో కొత్త సమస్యలు వచ్చి పడతాయని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts