కొన్ని తప్పులు చేయడం వలన, ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజుల్లో చాలా మంది, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఆర్థిక బరువు సమస్య వలన, చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో కఠినమైన ఆహార నియమాలను కూడా పాటించే వాళ్ళు, చాలామంది ఉన్నారు. కానీ, నిజానికి బరువు తగ్గాలనుకుని, రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, కొన్ని జ్యూసులు బాగా పనిచేస్తాయని, ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. స్మూతీస్ ని తీసుకుంటే మంచిదని అంటారు. నిజానికి వీటిలో నట్స్, పండ్లు వంటివి కొంచమే ఉంటాయి. మిగిలినవన్నీ హాని చేసే పదార్థాలే. ఐస్, పాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. దాంతో పాటుగా, పంచదారని కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ షుగర్ ని కూడా, కొన్నిట్లో వేస్తూ ఉంటారు. వీటివలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
200 మిల్లీలీటర్లు స్మూతీ తాగితే, 50 గ్రాములు షుగర్ వేసుకుంటారు. దీని వలన కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుంది. జీడిపప్పులు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ ని వేసి, స్మూతీస్ ని తీసుకోవడం వలన కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 100 గ్రాముల చక్కెర, 400 క్యాలరీల శక్తిని ఇస్తుంది. 250 స్మూతీ తాగినట్లయితే, 50 గ్రాములు షుగర్ బాడీ లోకి వెళ్ళిపోతుంది. షుగర్ అంతా ఆసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. దాంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం తగ్గిపోతుంది.
ఎముకలు పాడవుతాయి. రక్తనాళాల లోపల ఉండే, ఈ పొర దెబ్బతింటుంది. హృదయ సమస్యలు అలానే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఫుడ్ లోపలికి వెళితే కచ్చితంగా హాని కలుగుతుంది. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. పండ్లను జ్యూస్ చేసి తీసుకోవాలంటే పాలు వేసుకోవద్దు. అలానే చక్కెర కూడా వేసుకోకండి. పాలకు బదులుగా కొబ్బరి పాలు వేసుకుని తీసుకోవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఇలా స్మూతీస్ ని తీసుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసి తీసుకోండి.