సాధారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎండల్లో వెళ్లినప్పుడో.. వ్యాయామాలు చేసేటప్పుడో నీళ్లు తాగడం సహజం. అలాగే చెమటలు పట్టేంత పని చేసిన తరువాత కూడా దాహం వేస్తుంటుంది. ఎందుకంటే, చెమటలు రూపంలో శరీరంలో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది కాబట్టి. అయితే కొందరికి ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అయితే దీని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం.
ముఖ్యంగా కిడ్నీలు, మదుమేహం, గుండె, కాలేయాలు దెబ్బతినడం వంటి కారణాలేవో ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్నిసార్లు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల వంటి సమస్యలు కూడా ఈ అతిదాహానికి కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
అదే విధంగా అతి దాహంతో పాటు తరచూ మూత్రవిసర్జన, కడుపునొప్పి, నీరసం, తలనొప్పి, చూపు మసకగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలంటున్నారు నిపుణులు.