హెల్త్ టిప్స్

రోజూ బ‌ద్ద‌కంగా ఉంటూ ఏ ప‌ని చేయాల‌నిపించ‌డం లేదా.. అయితే వీటిని తినండి..

తరచుగా మూడ్ స్వింగ్ లా? ఈ కాలం చురుకు తక్కువగా వుంటోందా? కారణం ఏదైనప్పటికి, మీ మూడ్ ఆనందంగా మార్చేటందుకు కొన్ని ఆహారాలు పరిశీలించండి. ఇవి తక్షణం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సాధారణంగా తినే ఆహారమే కాకుండా, అదనంగా కూడా వీటిని తినవచ్చు. బలాన్నిచ్చే బెర్రీలు – బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి తక్షణమే భావాలను మార్చేస్తాయి. కేర్సర్ నిరోధకతకు కూడా వీటిని వాడతారు.

చిరునవ్వులనిచ్చే చెర్రీలు – చెర్రీ పండు లోని మెలటొనిన్ మంచి నిద్ర కలిగిస్తుంది. తిని పడుకుంటే, సంతోషంగా లేచి చురుకుగా పని చేసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన మంచి ఆహారం. ఆనందం ఇచ్చే ఆరెంజెస్ మరియు నిమ్మ – ఈ కాలంలో ఈ పండ్లు వాటి ప్రభావం అద్భుతంగా చూపుతాయి. లేచి పని మూడ్ తెచ్చుకోవాలంటే, విటమిన్ సి వుండే ఈ పండ్లు ఎంతో అవసరం. బాగా వున్నవారు తింటే మరింత మంచి మూడ్ లోకి వచ్చేస్తారు.

if you are very lazy take these foods

జస్ట్ ఫన్.. జామ్ మరియు జెల్లీ – వీటిలోని కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తినిస్తాయి. శరీరంలో తయారయ్యే సెరోటోనిన్ కు పని చేసి ఉత్సాహాన్నిస్తాయి. మీ ప్రతి రోజు ఆహారంలో పైన తెలిపిన పండ్లు అదనంగా చేర్చి మీ మనోభావాలను మరింత మెరుగుపరచుకోండి.

Admin

Recent Posts