హెల్త్ టిప్స్

ఫ్రెంచి మ‌హిళ‌లు అంత అందంగా ఉండ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటో తెలుసా..?

ఫ్రెంచి మహిళలు అంత అందంగా ఎందుకుంటారు? అది వారి ఆహార రహస్యం! అది తింటే…ఎటువంటి శరీరమైనా సరే నాజూకు పొందాల్సిందే. అంతేకాదు, వారు తినే ఆహారం బరువు కూడా తగ్గించేస్తుందట. ఇంతకీ ఆ ఆహారం ఏమిటో తెలుసా? ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తేలికగా లభించే….పెరుగు. ఇందులో ఉండేదేమిటి? లాక్టోస్ అనే కార్బోహైడ్రేట్లు. ఇవి తక్కువ సామర్ధ్యం కల కార్బోహైడ్రేట్లు.

పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా వాస్తవానికి పెరుగులోని లాక్టోస్ ని తినేస్తుంది. ప్రతి 12 గ్రాముల పెరుగులో 8 గ్రాముల కార్బోహైడ్రేట్లను ఇది తినేస్తుంది. దీనిని ఎలా తినాలి? అదనపు బరువు తగ్గాలంటే దీనిని 10 లేదా 15 రోజులపాటు తినాలి. ఇది తేలికగా జీర్ణం అవుతుంది. మంచి వ్యాధినిరోధకత కల్పిస్తుంది. శరీరంలో మలినాలు తొలగిస్తుంది.

why french women are very much beautiful

దీనిలో ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు వుంటాయి. రోజూ ఎంత తీసుకోవాలి? రోజుకు 50 గ్రాములు తీసుకుంటే మంచిది. ఎలా? బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు పండ్లతో కలిపి, లంచ్ లో ఉడికించిన బ్రౌన్ రైస్ తో కలిపి, డిన్నర్ సమయంలో యాపిల్ లేదా మరేదైనా జ్యూస్ తో కలిపి తీసుకోండి. ఈ రకంగా రోజుకు మూడుసార్లు మీరు తినే ఆహారంలో అదనంగా చేర్చి శారీరక రూప లావణ్యాలు సంతరించుకోండి.

Admin

Recent Posts