హెల్త్ టిప్స్

మీ పిల్ల‌ల ఎముక‌లు ఉక్కులా మారాలంటే.. వీటిని రోజూ తినిపించండి..!

ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవ‌చ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి.

సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే పిల్లలకి బలం చాలా ముఖ్యం. అందుకనే ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి అసలు పెట్టకండి. వీటి వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా బలం ఏమీ రాదు.

if you want your kids health then feed these if you want your kids health then feed these

పిల్లలకి మొలకలు, నానబెట్టిన పల్లీలు వంటివి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వండి. పచ్చి కొబ్బరిని రోజు విడిచి రోజు అయినా పిల్లలకి తినిపించాలి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి పిల్లలకి పెడుతూ ఉండండి. నువ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసి రోజు ఒకటి ఇవ్వండి. అప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి. మునగాకు జ్యూస్ చేసి పిల్లలకి పాలతో పాటుగా ఇవ్వండి.

పిల్లలకి పంచదారని అస్సలు పెట్టొద్దు. పంచదారకి బదులుగా తాటి బెల్లం పెట్టొచ్చు. పిల్లలకి క్యాల్షియం అందడానికి రాగులని ఇవ్వండి. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ పెట్టండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా పిల్లలు రోజూ తినేటట్టు చూడండి. వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలని కూడా పెట్టండి. వీటిని కనుక మీరు రెగ్యులర్ గా పాటించారంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటివి మీరు వారి డైట్ లో ఇచ్చారంటే, ఇక వారి ఆరోగ్యం గురించి మీరు ఆలోచించక్కర్లేదు.

Admin

Recent Posts