Heart Beat : హార్ట్ బీట్ స‌రిగ్గా ఉండ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Heart Beat : మ‌న‌లో చాలా మంది క్ర‌మ‌ర‌హిత హృద‌య స్పంద‌న‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దీనినే అరిథ్మియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. గుండె వేగంగా కొట్టుకోవ‌డం లేదా నెమ్మ‌దిగా కొట్టుకోవ‌డాన్నే అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్య‌వ‌స్థలో భంగం ఏర్ప‌డ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. గుండె సంబంధిత స‌మస్య‌లు, అధిక ర‌క్త‌పోటు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికి నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. స‌మ‌స్య రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవాలి. అలాగే మ‌న జీవ‌న విధానంలో మార్పులు చేసుకోవాలి. దీంతో గుండె ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఇటువంటి అరిథ్మియా స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ముఖ్యంగా ఏరోబిక్స్ వంటివి చేయాలి. దీంతో గుండె స‌క్ర‌మంగా కొట్టుకుంటుంది. అలాగే ఆహారంలో భాగంగా పండ్లు, కూర‌గాయ‌లను ఎక్కువ‌గా తీసుకోవాలి. తృణ ధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, మంచి కొవ్వులు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అదే విధంగా జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. ఇక ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. రోజూ ధ్యానం, యోగా వంటి చేయాలి. మ‌న‌సుకు న‌చ్చిన సంగీతాన్ని వినాలి. అంతేకాకుండా ధూమ‌ప‌నం, మ‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి.

if your Heart Beat is not healthy then follow these tips
Heart Beat

టీ, కాఫీ ల‌ను తాగ‌డం త‌గ్గించాలి. ఇక శ‌రీర బ‌రువు అదుపులో ఉంచుకోవాలి. డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. అలాగే రోజూ క‌నీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర‌పోవాలి. అలాగే రోజూ 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగాలి. ఈ విధంగా జీవ‌న విధానంలో మార్పులు చేసుకుంటూ, త‌గిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె కొట్టుకునే వేగంలో వ‌చ్చే మార్పులను త‌గ్గించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts