Anda Masala Curry : రెస్టారెంట్ స్టైల్‌లో అండా మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Anda Masala Curry : మ‌న‌కు రెస్టారెంట్ లో ల‌భించే ఎగ్ వెరైటీలల్లో అండా మ‌సాలా కూడా ఒక‌టి. అండా మ‌సాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ అండా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా అండా మసాలాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ అండా మ‌సాలాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అండా మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 3, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్, క‌సూరిమెంతి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Anda Masala Curry recipe very tasty how to make this
Anda Masala Curry

అండా మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత కొద్దిగా ఉప్పు, ప‌సుపు, కారం వేసి వేడి చేయాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ గా చేసి వేసుకోవాలి.

వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత గుడ్లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క‌సూరిమెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే అండా మ‌సాలా త‌యార‌వుతుంది. ఈ అండా మసాలాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ అండా మ‌సాలాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts