Immunity Drink : దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ ఎంత‌లా పెరుగుతుందంటే.. మీరే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Immunity Drink : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన, ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనేక తేడా ప్ర‌తి ఒక్క‌రు ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం వల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌ల త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే దేనిలోనూ చురుకుగా పాల్గొన‌లేక‌పోతుంటారు. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ఎక్కువ‌గా ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి తక్కువ‌గా ఉండడం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి బారిన కూడా ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. అదే విధంగా వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా ద‌గ్గు, జలుబు, క‌ఫం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

చాలా మంది రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి అలాగే జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవడానికి అనేక ర‌కాల స‌ప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. ఎటువంటి మందులు వాడే అవ‌స‌రం లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో అర టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ శొంఠి పొడి, చిటికెడు మిరియాల పొడి, అర టీ స్పూన్ బెల్లం తురుము, చిటికెడు న‌ల్ల ఉప్పు లేదా సైంధ‌వ ల‌వ‌ణం వేసి క‌ల‌పాలి.

Immunity Drink take daily for better results
Immunity Drink

అలాగే రెండు ల‌వంగాల‌ను మెత్త‌గా పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని అర గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ పానీయాన్ని వ‌డ‌క‌ట్టుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని టీ తాగిన‌ట్టు చ‌ప్ప‌రిస్తూ తాగాలి. పిల్ల‌ల‌కు వ‌య‌సును బ‌ట్టి అర క‌ప్పు లేదా పావు క‌ప్పు మోతాదులో ఇవ్వాలి. ఇలా ఉద‌యం అల్పాహారం చేసిన గంట త‌రువాత లేదా భోజ‌నం చేసిన గంట త‌రువాత తీసుకోవాలి. ఇలా మ‌న ఇంట్లోనే పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జ‌లుబు, దగ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. అలాగే ఈ పానీయాన్ని రెండు రోజులకొక‌సారి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధక శ‌క్తి పెరిగి మ‌నం త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Share
D

Recent Posts