చంటిపిల్లలను చూడగానే చాలామంది వారి బుగ్గ గిల్లడమో, అమాంతం దగ్గరకు తీసుకొని బుగ్గమీద ఓ ముద్దుపెట్టడమో చేస్తుంటారు. ఇలా చిన్నపిల్లలపై వాళ్లకున్న ప్రేమలను వ్యక్తపరుస్తారు. కానీ 6 నెలల వయస్సు లోపున్న చంటి పిల్లల్ని ఇలా ముద్దుచేయకూడదు. అసలు ఆ పసిపాప లేదా బాబు తల్లే తన బిడ్డను ఎవ్వరూ ముద్దుపెట్టకుండా చూసుకోవాలి. లేకపోతే ఎదిగే బిడ్డ ప్రాణానికే ప్రమాదం. 6 నెలల లోపు వయసున్న పిల్లల్లో ఇంకా వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు కాబట్టి చిన్న చిన్న రోగాలకే వారి శరీరం తట్టుకోలేదు. అలాంటి సమయంలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బిడ్డ ప్రాణానికే ప్రమాదం.
100 లో 85 మంది పెదాలు వైరస్ లను కలిగిఉంటాయట. ఇలాంటి వారు వచ్చి 6 నెలలలోపు పిల్లలను ముద్దు పెట్టినప్పుడు వారికుండే ఆ వైరస్ లు పిల్లలపై త్వరగా ఎఫెక్ట్ ను చూపుతాయి. జలుబు ఉన్న వారు మీ పిల్లల్ని ముద్దుపెడితే ఆ పసిపాపకు లివర్, బ్రెయిన్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుందట. పిల్లలు పుట్టిన 3 నెలల లోపు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.
చాలా వ్యాధులు నోటి తుంపర్ల ద్వారా వ్యాపించేవి అయి ఉంటాయి. కాబట్టి ఎవర్నైనా పిల్లల్ని ముద్దుపెట్టనివ్వకపోవడమే బెటర్. ఇంకొంత మంది ఏకంగా చిన్నపిల్లల పెదాలపై ముద్దుపెట్టడం, నాలుకను నాలుకతో టచ్ చేయడం లాంటివి చేస్తారు. ఇవి మరింత ప్రమాదకరం. దోమలున్నాయని ఆలౌట్, గుడ్ నైట్ లాంటి వాటిని కూడా ఎక్కువగా వాడకండి. వాటి వల్ల పసిపిల్లలకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.