Off Beat

ఈ 6 విషయాలని మనం నిజమని నమ్ముతాము. కానీ అవి అపోహలు తెలుసా..? ఇన్ని రోజులు ఎలా నమ్మామో?

అపోహ‌లు అనేవి ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. అనేక అంశాల్లో వారు అపోహ‌ల‌ను నిజాలుగా న‌మ్ముతారు. నిజాల‌ను తెలియ‌జేసినా వారు న‌మ్మ‌రు స‌రిక‌దా చెప్పిన వారిదే త‌ప్పు అంటారు. ఇక సైంటిస్టులు అయితే జ‌నాల్లో సైన్స్ ప‌రంగా ఉండే అపోహ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిస్తూనే ఉంటారు. కానీ అది ఒక‌సారికి ప‌రిమితం కాదు. అవి జ‌నాల్లో బాగా పాపుల‌ర్ అవుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు అపోహ‌లను జ‌నాలు నిజం అని న‌మ్ముతూనే ఉంటారు. మ‌రి అలాంటి అపోహ‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హెచ్ఐవీ అనేది అబ‌ద్దం, అస‌లది లేదు

చాలా మంది జ‌నాల‌కు అస‌లు హెచ్ఐవీ అనేది ఏంటో తెలియ‌దు. దీంతో అది అస్స‌లు లేనే లేదు అనుకుంటారు. ఇది human immunodeficiency virus. ఇది పాజిటివ్ ఉంటే ఎయిడ్స్ వ‌చ్చిన‌ట్టు అర్థం. మ‌న దేశంలో చాలా మంది ఎయిడ్స్ వ్యాధి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని హెచ్ఐవీ బాధితులు అని కూడా అంటారు. హెచ్ఐవీని క‌నుగొన్న సైంటిస్టుకు నోబెల్ బ‌హుమ‌తి కూడా ఇచ్చారు.

people around the world believe these are myths

2. మ‌న మెద‌డు కేవ‌లం 5, 10 శాత‌మే ప‌నిచేస్తుంది

ఇది ఎవ‌రు వ్యాప్తి చెందించారో కానీ పూర్తిగా అబ‌ద్దం. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మ‌న మెద‌డు 100 శాతం ప‌నిచేస్తుంది. ఎందుకంటే.. మ‌నం ఒక ప‌నిచేస్తున్న‌ప్పుడు దానిపైనే 100 శాతం ఏకాగ్ర‌త పెడ‌తాం. దీంతో రెండో ప‌ని చేయ‌లేం. అందుక‌నే మ‌న మెద‌డు 100 శాతం ప‌నిచేయ‌దు అని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు చెప్పాలంటే మ‌నం సైకిల్ తొక్కుతూ, వాహ‌నం న‌డుపుతూ బుక్ చ‌ద‌వ‌లేం క‌దా. అలాగే స్నానం చేస్తూ మ‌రో ప‌ని చేయ‌లేం. ఇలాగ‌న్న‌మాట‌. క‌నుక ఏ యాక్టివిటీ చేసినా మ‌న మెద‌డు 100 శాతం ప‌ని చేస్తుంది.

3. జెనిటిక‌ల్లీ మోడిఫై చేసిన పండ్లు సేఫ్ కాదు

ఇందులో కూడా వాస్త‌వం లేదు. ఎందుకంటే జెనెటిక్‌గా త‌యారు చేసిన పండ్లు, కూర‌గాయ‌లు తిన‌డం సేఫే. వాటిని సైంటిస్టులు చాలా జాగ్ర‌త్త‌గా టెస్ట్‌లు చేసి కానీ మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌రు. ముందే అన్ని ప్ర‌యోగాలు చేస్తారు. స‌ద‌రు పండ్లు, కూర‌గాయ‌లు మ‌నుషులకు ఏ విధంగానైనా అనారోగ్యాన్ని క‌లిగిస్తాయా ? అని సైంటిస్టులు ముందే పరిశోధ‌న‌ల ద్వారా నిర్దారించుకుంటారు. అనంతర‌మే వారు ఆ పండ్లు, కూర‌గాయ‌లను తినేందుకు సేఫ్ అని గుర్తించి మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తారు. కాబ‌ట్టి వాటిని నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. ఎలాంటి భ‌యం చెందాల్సిన ప‌ని లేదు.

4. గ్లోబ‌ల్ వార్మింగ్ అనేది ఒక చంద‌మామ‌ క‌థ‌

నేటి త‌రుణంలో చాలా మందికి గ్లోబ‌ల్ వార్మింగ్ అంటే ఏమిటో తెలియ‌దు. గ్లోబ‌ల్ వార్మింగ్ అనేది భూమి వేడెక్క‌డం. 1905 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న భూ ఉష్ణోగ్ర‌త 0.86 డిగ్రీలు పెరిగింది. అందుకు కార‌ణం గ్రీన్ హౌస్ వాయువులే. అవి త‌గ్గ‌నంత వ‌ర‌కు ఇలా భూ వాతావ‌ర‌ణంలో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతూనే ఉంటాయి. అవి 2040 వ‌ర‌కు మ‌రో 2 డిగ్రీలు, 2100 వ‌ర‌కు మ‌రో 5 డిగ్రీల వ‌ర‌కు పెరిగే చాన్స్ ఉంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అదే జ‌రిగితే భూమిపై మాన‌వ మ‌నుగ‌డ క‌ష్ట‌మే అని వారు అంటున్నారు.

5. వ‌ర్షంలో ప‌రిగెత్తితే త‌డ‌వ‌కుండా ఉండ‌వ‌చ్చు

ఇది కూడా అబ‌ద్ద‌మే. ఎందుకంటే వ‌ర్షంలో ప‌రిగెత్త‌డం క‌న్నా మామూలుగా వాకింగ్ చేస్తేనే తడిసే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీన్ని సైంటిస్టులు ప్ర‌యోగాల ద్వారా నిరూపించారు కూడా. క‌నుక ఈ సారి వ‌ర్షంలో ప‌రిగెత్త‌కండి. పొడిగా ఉండాలంటే వాకింగ్ చేయండి.

6. జ‌న్యువుల‌ను బ‌ట్టి మ‌నిషి జాతి ఉంటుంది

ఇది కూడా వాస్త‌వం కాదు. భూమి మీద ఆయా ప్రాంతాల‌లో నివాసం ఉండే జ‌నాలు, వారి అల‌వాట్లు, అక్క‌డి వాతావ‌ర‌ణం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నుషుల్లో అనేక జాతులు ఉంటాయి. కొంద‌రు పొట్టిగా ఉంటే కొంద‌రు పొడుగ్గా, కొంద‌రు న‌ల్ల‌గా, కొంద‌రు తెల్ల‌గా ఉంటారు. అంతేకానీ ఇవి జ‌న్యువుల‌ను బ‌ట్టి డిసైడ్ అవ్వ‌వు.

Admin

Recent Posts