Lemon Peel Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..

Lemon Peel Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. కొవ్వును క‌రిగించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం కేవ‌లం నిమ్మ‌కాయ‌ల‌ను మాత్ర‌మే ఉయోగించాల్సి ఉంటుంది. ముందుగా 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని రెండు భాగాలుగా చేసి వాటిలో ఉండే గింజ‌ల‌ను తీసి వేయాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా త‌యారు చేసిన నిమ్మ‌కాయ పేస్ట్ ను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి క‌లపాలి.

ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని నేరుగా కూడా తాగ‌వ‌చ్చు. అయితే ఇది చేదుగా ఉంటుంది క‌నుక దీనిలో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తీసుకోవ‌చ్చు. అయితే డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు తేనెను క‌లిపి తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల పొట్ట మొత్తం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో ఉన్న మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు కూడా తొల‌గిపోతాయి. ఈ పానీయం పుల్ల‌గా, చేదుగా ఉన్న‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గించ‌డంలో ఇది అద్భుతంగా ప‌ని చేస్తుంది. కేవ‌లం నిమ్మ‌ర‌సాన్ని నీటిలో క‌లిపి తీసుకోవ‌చ్చు క‌దా అని చాలా అనుకుంటారు. కేవ‌లం నిమ్మ‌ర‌సంలోనే కాకుండా నిమ్మ‌తొక్క‌లో కూడా అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు బ‌రువు తగ్గేలా చేయ‌డంలో చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. ఈ స‌మ్మేళ‌నాలు చాలా శ‌క్తివంత‌మైన‌వి. 6 గ్రాముల‌ నిమ్మ‌కాయ తొక్క‌లో 3 గ్రాముల క్యాల‌రీలు, ఒక గ్రాము కార్బోహైడ్రేట్స్, ఒక గ్రాము ఫైబ‌ర్, 9 శాతం విట‌మిన్ సి ఉంటాయి. అలాగే వీటిలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా చిన్న మొత్తంలో ఉంటాయి.

Lemon Peel Drink take this daily on empty stomach for these benefits
Lemon Peel Drink

ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల టైప్ 2డ‌యాబెటిస్ అదుపులో ఉండ‌డంతో పాటు గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ పానీయం శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించ‌డంలో కూడా చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అలాగే నిమ్మ‌కాయ‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. అలాగే నిమ్మ‌కాయ‌లో పెక్టిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది కూడా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిప‌డుతున్న వారు, అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా నిమ్మ‌కాయ‌ల‌తో చేసిన పానీయాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

D

Recent Posts