లిక్కర్ చూస్తే తాగకుండా వుండలేని వారికి శుభవార్త. ఆల్కహాల్ తాగేవారి పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతినకుండా వుండాలంటే స్ట్రా బెర్రీ పండ్లు తింటే చాలంటున్నారు పరిశోధకులు. ఇటలీ, సెర్బియా, స్పెయిన్ దేశాల పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి ఈపరిశోధన నిర్వహించారు.
పరిశోధకులలో ఒకరైన బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన సారా తులిపాని మేరకు స్త్రాబెర్రీ పండ్ల రసాలు పొట్ట లోపలి భాగ లైనింగ్ కాపాడటంలో అమోఘంగా పనిచేస్తాయని అవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను, ఎంజైములను యాక్టివేట్ చేయటమే కాక గ్యాస్ సంబంధిత వ్యాధులను కూడా అరికడతాయని తెలిపారు.
వీరి పరిశోధనా ఫలితాలను పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ప్రచురించింది. స్ట్రాబెర్రీ పండు ఆల్కహాల్ కారణంగానే కాక ఇతర కారణాలవలన పొట్టలో వచ్చే పుండ్లను కూడా నయం చేస్తుందని, కడుపు మంటను పోగొడుతుందని, గ్యాస్ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించగలదని పరిశోధన చెపుతోంది. పరిశోధకుల బృందం మొదటగా తమ ప్రయోగాన్ని ఎలుకలపై చేసి ఫలితాలను కనుగొన్నట్లు తెలిపారు.