మూలశంక వ్యాధిని పైల్స్ లేదా హెమరాయిడ్స్ అని కూడా అంటారు. గుద భాగంలో రక్తనాళాలు ఉబ్బి మంటపెడుతూంటాయి. పైల్స్ రావటానికి మలబద్ధకం ప్రధానం. అనారోగ్య ఆహారాలు తీసుకుంటూ మలం కొరకు బలవంతంగా ప్రయత్నిస్తే పైల్స్ వచ్చే అవకాశం వుంది. పైల్స్ సహజంగా నివారించడం ఎలా? పైల్స్ నివారణకై పీచు అధికంగా వుండే ఆహారం తీసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. తాజా పండ్లు, కూరలు ఆహారంలో తప్పని సరిగా వుండాలి.
బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు మూలశంక రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి. పైల్స్ తగ్గాలంటే, నీరు అధికంగా తీసుకోండి. 8 నుండి 10 గ్లాసుల నీరు ప్రతిరోజూ తాగండి. తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సూప్ మొదలైనవి పైల్స్ నివారణకు సహకరిస్తాయి. అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి. ఆల్కహాలు మానండి. మసాలా వేసి వండినఆహారాలు మానాలి.
మామిడి, నిమ్మ, బొప్పాయి, ఫిగ్, మొదలైన పండ్ల రసాలు ప్రతి రోజూ తాగి మలబద్ధకం లేకుండా చూసుకోండి. కాఫీ వంటి కెఫీన్ పదార్ధాలు వాడరాదు. నిమ్మ, బెర్రీలు, ఛీజ్, పెరుగు, ఆపిల్స్, టమాటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. ఆహారంలో చేర్చండి. అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి మూలశంక వ్యాధి నయమైపోతుంది. పై తిండిపదార్ధాల జాబితాను మీ ఆహారంలో చేర్చి, పైల్స్ వ్యాధిని సహజంగా నివారించుకోండి. బాగా విశ్రాంతి తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామాలు చేయటం కూడా మంచిది.