అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు నిద్ర సరిగ్గా పోవ‌డం లేదా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

నిద్రలేమి వ్యాధితో బాధపడే వ్యక్తులకు గుండెపోటుకు అధికంగా గురయ్యే అవకాశాలు 27 నుండి 45 శాతం వరకు వుంటాయని ఒక నార్వే దేశపు పరిశోధన సూచించింది. నిద్ర సమస్యలు సాధారణమేనని, వీటిని తేలికగానే నయం చేయవచ్చని, ఇప్పటికే 30 శాతం ప్రజలు నిద్రలేమి సమస్య తెలియజేస్తున్నారని నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధనా బృంద నేత లార్స్ ఎరిక్ లగ్ సాండ్ తెలిపినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది.

కనుక నిద్రలేమి వ్యాధికి, గుండెజబ్బుకు మధ్య వున్న సంబంధం ప్రజలు తెలుసుకొని వుండాలని తెలియజేశారు. ఇతర జబ్బులవలన వచ్చే గుండె జబ్బు వ్యాధికంటే కూడా నిద్రలేమి వలన వచ్చే గుండె జబ్బు వ్యాధి 45 శాతం అత్యధిక రిస్కు కలదన్నారు. ఒక మోస్తరు నిద్రలేమి కలవారికి 30 శాతం, నిద్రపోయి లేచినప్పటికి తమకు హాయిగా లేదని ఫిర్యాదులు చేసే వారిలో 27 శాతం రిస్కు వున్నట్లు పరిశోధన తెలుపుతోంది.

sleeplessness causes heart attacks says study

పరిశోధకులు 52,610 మంది వయోజనులను పరిశోధనకై తీసుకున్నారు. వీరిలో 2,368 మంది గుండెపోటుకు గురయ్యారని నార్వే నేషనల్ కాస్ ఆఫ్ డెత్ రిజిస్ట్రీ రికార్డులు వెల్లడి చేస్తున్నాయి. కనుక గాఢమైన నిద్ర గుండెపోటుకు దూరంగా వుంచుతుంది. అందుకుగాను అందరూ తగిన వ్యాయామాలు ఆహారపుటలవాట్లు పాటించాలని అధ్యయన కర్త తెలిపారు.

Admin

Recent Posts