హెల్త్ టిప్స్

ఒక్క ఆకు.. ఒకే ఒక్క ఆకు.. రోజూ పరగడుపున తిన్నారంటే ఆ సమస్యలే ఉండవు..

వైద్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక ఔషధ చెట్లు.. మొక్కలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. ఈ ఔషధ మొక్కలు మన శరీరంలోని వివిధ సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తాయి.. ఇంకా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాంటి ఔషధ మొక్కల్లో తమలపాకులు ఒకటి.. తమలపాకు మొక్క ఆకులు, వేర్లు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. తమలపాకు అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు ఆకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.. దీంతో పాటు కాల్షియం కూడా మెండుగా ఉంటుంది.

తమలపాకు, దాని వేర్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. తమలపాకును దేశ విదేశాల్లో ఔషధాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. దీని ఉపయోగం మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. తమలపాకులు మొక్క పెరగడానికి పెద్ద లేదా ప్రత్యేక స్థలం అంటూ అవసరం లేదు. చిన్న కుండీలో నాటినా అది పెద్దదిగా మారుతుంది. తమలపాకు గొంతు వ్యాధులకు, దంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనేక వ్యాధుల చికిత్సలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది జలుబు, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తమలపాకు గుండె సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.

many wonderful health benefits of betel leaves

తమలపాకు వేర్లను నీటిలో కలపి తీసుకోవచ్చు.. తమలపాకులు వేరుగా లేదా వాటి నుంచి రసాన్ని తీసి రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.. ఇంకా తమలపాకు పొడిని దంతాలు, చిగుళ్లకు పూయడం వంటి అనేక ప్రయోజనకరమైన మార్గాల్లో ఉపయోగించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, నోటి ఆరోగ్యం నుండి జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు.. ఇలా చాలా సమస్యలకు తమలపాకు అమృతం.

తమలపాకులు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తమలపాకు నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోయి గుండె మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా తమలపాకులు తీసుకోవడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి.. అయితే.. రోజూ పరగడుపున తింటే ప్రయోజనాలు చేకూరుతాయి..

Admin

Recent Posts