ఈ కోవలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ , మంచు మనోజ్ విషయం లో కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు . ఎందుకంటే ప్రభాస్, అల్లుఅర్జున్, సమయంలోనే తెరంగేట్రం చేసారు కానీ, ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. తరుణ్, గోపీచంద్, ఉదయకిరణ్, వీరికి విజయాలు లేకపోయినప్పటికీ ఎదో ఒక టైంలో మంచి సక్సెస్ రుచి చేసినవారే కానీ మనోజ్ మాత్రం ఇంకా అంత పండగ చేసుకోనేంత సినిమా విజయం మాత్రం జరుపుకోలేదు. ఎందుకో తెలీదు, మన టాలీవుడ్ లో మోహన్ బాబుకి మంచి పేరు ఉన్నపటికీ మంచు వారి మంచి చిత్రాలను మనం గుర్తించం అని అపుడప్పుడు అనిపిస్తుంటుంది. అందులోను మంచు మనోజ్ వైవిధ్యబరితమైన కథలతో మన ముందు వచ్చినప్పటికి, ఎందుకో ప్రేక్షకులనుండి కావాల్సినంత ఆదరణ మాత్రం పొందలేక పోతున్నాడు.
నిజానికి వారి అన్నయ విష్ణు కన్నా మనోజ్ చిత్రాలు చాలా బాగుంటాయి. ఒకసారి అతని సినిమాల చిట్టా గనుక నెమరువేసుకున్నట్టయితే దొంగ దొంగది, బిందాస్, పోటుగాడు,మిస్టర్ నూకయ్య, ఊకొడతారా ఉలిక్కి పడతారా, వేదం,కరెంటు తీగ, జుమ్మంది నాదం, శౌర్య, శ్రీ, రాజు భాయ్, ప్రయాణం, ఎటాక్, పాండవులు, పాండవులు తుమ్మెద. ఇలా కథకథనం పరంగా, పాత్రపరంగా నూతనంగా ఉన్నపటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం గమనార్హం. దీనికి కారణం మనోజ్ తనదైన శైలిలో పాత్రకు గొప్పదనం తీసుకురాకపోడం అని అనుకుంటారు. ఎందుకో ఏ పాత్రా వేసిన మనోజ్ నే చూస్తాం తప్ప అందులో ఉన్న క్యారెక్టర్ కి కనెక్ట్ కామేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.
నిజానికి మన మోహన్ బాబు పూర్వం సినిమాలు చాల బాగుంటాయి. పాత్రలు ఎవరైనా, ఎలా ఉన్న చూడగలుగుతాం, ఇమిడిపోతాం కథలోకి. అదే మ్యాజిక్ మంచు బ్రదర్స్ చేయలేకపోయారు అనే చెప్పాలి. వీరిద్దరి కంటే వీరి సోదరి లక్ష్మి మంచు, కొన్ని సినిమాలతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన శైలితో. సినిమాలు కస్టపడి,ఇష్టపడి చేసినప్పటికీ సరైన సమయం, అదృష్టం కూడా రావాలి. చాల మంది నేపాటిసమ్ అంటారు కానీ, మనోజ్ మాత్రం చాలామంది నూతన దర్శకులను, నిర్మాతలను, హీరోయిన్లను, మ్యూజిక్ డైరెక్టర్ లను ఇండస్ట్రీ కి అందిస్తూనే సినిమా విజయం కోసం కష్టపడ్తూనే ఉన్నారు .. తాప్సి, తమన్నా, పాయల్ గోష్, షీనా, లేఖన వాషింగ్టన్,అనుప్రియ గోయెంకా, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, తదితర నాయికలు, ఈయన చిత్రాలతో తెలుగు లో కెరీర్ ప్రారంభించినవారవడం గమనార్హం.