హెల్త్ టిప్స్

Brown Rice : తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఇప్పుడే తింటారు..

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణం ప్ర‌ధానంగా ఆహార‌పు అల‌వాట్లే అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చాలా మంది తెల్ల అన్నం తింటున్నారు. దీంతో అనేక రోగాలు వ‌స్తున్నాయి. కానీ దానికి బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి బ్రౌన్‌ రైస్‌ మంచి ఆహారం అని చెప్పవచ్చు. అధిక బరువుతో బాధపడేవారు రోజూ రెండు పూటలా బ్రౌన్‌ రైస్‌ను తినాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు. శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రుగుతుంది. అలాగే పాలిచ్చే తల్లులు బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.

many wonderful health benefits of brown rice

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్‌ రైస్‌ను రోజూ తినాలి. దీంట్లో ఉండే పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ఇక బ్రౌన్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ రైస్‌ను తినడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. డిప్రెషన్ తగ్గుతుంది. ఇలా అనేక లాభాలు ఉంటాయి క‌నుక బ్రౌన్ రైస్‌ను ఎవ‌రైనా స‌రే త‌ప్ప‌క తినాల్సిందే.

Admin

Recent Posts