హెల్త్ టిప్స్

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

Pacha Karpooram : దేవుడి పూజ‌లో ఉప‌యోగించే క‌ర్పూరం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది తెల్ల‌గా ఉంటుంది. కానీ ప‌చ్చ క‌ర్పూరం అని ఇంకొక‌టి ఉంటుంది. ఇది మ‌న‌కు వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని తిన‌వ‌చ్చు కూడా. ప‌చ్చ క‌ర్పూరంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్నను గానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి.

బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళ వెంట నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. బీపీ ఉన్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బీపీ పెరగకుండా అరికడుతుంది. మూత్రం పోసేటపుడు మంట, చీము, సుఖ వ్యాధులున్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళు మంటలు, అరికాళ్లు, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

many wonderful health benefits of pacha karpooram

పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మొత్తగానూరి.. దాంట్లో అయిదు గ్రాములు ఎండు ద్రాక్ష వేసి మళ్ళీ నూరి.. దీన్ని శనగ గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని.. పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చెందుతుంది. లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. పచ్చకర్పూరాన్ని రోజూ మూడు పూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటుంటే బలం, రక్తపుష్టి కలుగుతాయి. లైంగిక శక్తి పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. కంటి జబ్బులు, రక్తస్రావాలు త‌గ్గుతాయి. ఏ మందు వాడుతున్నపుడైనా ఆ మందుతోపాటు ఒక పలుకు పచ్చ కర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది. ఇలా ప‌చ్చ క‌ర్పూరంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin