హెల్త్ టిప్స్

పాప్‌కార్న్ అని లైట్ తీస్కోకండి.. దాంతో బోలెడు లాభాలు ఉంటాయి..!

అధిక బరువు త‌గ్గేందుకు అనేక మంది వెయిట్ లాస్ డైట్ ప్లాన్ల‌ను పాటిస్తుంటారు. అయితే ఆ ప్లాన్ల‌లో చేర్చుకోవాల్సిన ఉత్త‌మ స్నాక్‌గా పాప్‌కార్న్‌ను చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. ఇత‌ర ఏ త‌ర‌హా స్నాక్స్‌ను తీసుకున్నా.. చాలా మంది బ‌రువును పెంచే స్నాక్స్‌నే తింటుంటారు. కానీ పాప్‌కార్న్ అలా కాదు.. బ‌రువు త‌గ్గిస్తుంది. అలాగే స్నాక్‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సాధార‌ణంగా చాలా మంది మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌కు న‌డుమ‌.. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటుంటారు. ఆ స‌మ‌యంలో చిరుతిండి కాకుండా పాప్‌కార్న్ తింటే.. అటు స్నాక్స్ తినాల‌నే మోజు తీరుతుంది. దీంతోపాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.

పాప్‌కార్న్‌తో మ‌న శ‌రీరానికి చాలా త‌క్కువ క్యాల‌రీలు ల‌భిస్తాయి. అందువ‌ల్ల దీన్ని ఈవెనింగ్ స్నాక్‌గా చేసుకోవ‌చ్చు. వెయిట్‌లాస్ డైట్ ప్లాన్‌లో ఉన్న‌వారు పాప్‌కార్న్‌ను చ‌క్క‌ని స్నాక్స్‌గా తిన‌వ‌చ్చు. ఒక క‌ప్పు సాధార‌ణ పాప్‌కార్న్‌లో కేవ‌లం 30 క్యాల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. కానీ వాటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి బోలెడు ఫైబర్ అందుతుంది. ఇది శ‌రీర జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. అంతేకాదు, ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి కాకుండా చూస్తుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా బ‌రువు తగ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

many wonderful health benefits of pop corn

యాంటీ ఆక్సిడెంట్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన ప్ర‌కారం.. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీరంలో వాపుల‌ను త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల ఒళ్లు నొప్పులు ఉన్న‌వారు పాప్‌కార్న్‌ను తింటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక మ‌న‌కు 75 గ్రాముల సాధార‌ణ పాప్‌కార్న్‌లో 300 మిల్లీగ్రాముల పాలీఫినాల్స్ ల‌భిస్తాయి. అందువ‌ల్ల పాప్‌కార్న్ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక మ‌న శ‌రీరంలో పెరిగే క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు పాప్‌కార్న్‌లో ఉంటాయి. అలాగే డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాప్‌కార్న్‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇక జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పాప్‌కార్న్ ఉత్త‌మ‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. కాగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ చెబుతున్న ప్ర‌కారం.. పాప్‌కార్న్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ట‌. అలాగే పాప్‌కార్న్‌లో ఉండే బీటా కెరోటిన్‌, లుటీన్‌, జియాజాంతిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు కంటి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. క‌నుక‌.. పాప్‌కార్న్‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి. ఇక‌పై స్నాక్స్ తినాలనుకుంటే.. పాప్‌కార్న్‌ను తినండి..!

Admin

Recent Posts