మష్రూమ్స్… పల్లెటూర్లో అయితే పుట్టగొడుగులు. ఈ మధ్య ఎక్కువగా ఇవి లభ్యమవుతున్నాయి. వీటిల్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని అంటూ ఉంటారు గాని ఇది నాన్ వెజ్ లేదా వెజ్ అనేది తెలియక చాలా మంది తినే ప్రయత్నం చేయరు. కాని దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. మష్రూమ్స్ వలన అనేక ఉపయోగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు.
ఇతర కూరగాయలలో లేని పోషకాలు కొన్ని మష్రూమ్స్ లో లభ్యం అవుతాయి. మష్రూమ్స్ లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. మష్రూమ్స్ మన శరీర రక్తం లో కలిసిపోయిన కొవ్వును కరిగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వీటిలో ఉండే లెంటీసైన్ ,మరియు ఎరిటేడేనిన్ అనే పదార్థాలు రక్తంలో కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి.
అంతే కాకుండా కరిగిన కొవ్వును ఇతర భాగాల నుంచి తరలించి శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తాయి.శరీరం లో కొవ్వు శాతం తగ్గించడం ద్వారా హై బీపీ, గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. రోజు మష్రూమ్స్ తినడం వల్ల ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.మహిళల్లో గర్బ సంబంధిత రోగాలకు,మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు. అందుచేత మష్రూమ్స్ ను మనం రోజూ తీసుకునే ఆహారంలో చేర్చితే పలు రకాల అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్త పడవచ్చు…