హెల్త్ టిప్స్

Neem And Turmeric : వేప, పసుపు వలన ఇన్ని ఉపయోగాలని తెలిస్తే.. పక్కా రోజూ తీసుకుంటారు..!

Neem And Turmeric : మనకి తెలియకుండా, మనం రోజు వాడే పదార్థాలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను ఉపయోగించడం వలన, మనకి ఎంతో మేలు కలుగుతుంది. వేప ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వకాలం నుండి, ఆయుర్వేదంలో వేపని ఉపయోగించడం జరుగుతోంది. చాలా రకాల సమస్యల్ని వేప దూరం చేస్తుంది. అలానే, పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపు కూడా వివిధ రకాల సమస్యల్ని ఈజీగా దూరం చేయగలదు.

వేప చేసే మొదటి పని అన్నవాహికని క్లీన్ చేయడం. అన్నవాహికలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అన్నవాహికలో సూక్ష్మజీవులు ఉండటం వలన, ఆహారము బాగా జీర్ణం అవుతుంది. వేప, పసుపు కలిపి గుళికలని తీసుకుంటే, అన్నవాహికలో ఉన్న పరాన్న జీవులని, పెద్ద పేగులని క్లీన్ చేస్తుంది. దీనికోసం ముందు మీరు, వేప ఇగుర్లను శుభ్రపరచుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి, మెత్తగా చేసుకోండి.

Neem And Turmeric many wonderful health benefits

చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే, పసుపుని కూడా చిన్న చిన్న ఉండలు కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత, పరగడుపున వేడి నీళ్లతో ఈ రెండిటిని తీసుకోవాలి. దీనిని మీరు రోజు చేయక్కర్లేదు. వారానికి ఒకసారి తీసుకుంటే, సరిపోతుంది. వారానికి ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మీ శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. శరీరంలో ఎక్కడ ఎలా శక్తిని విభజన చేయాలో తెలుసుకుంటుంది.

వీటిని కలిపి తీసుకోవడం వలన ఇలా ఇన్ని ఉపయోగాలని పొందవచ్చు. ఇది ఇలా ఉంటే, వేప జ్యూస్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వేప జ్యూస్ ని తీసుకుంటే పొట్టని క్లీన్ గా ఉంటుంది. జీర్ణ క్రియని మెరుగుపరుస్తుంది. వేప జ్యూస్ ఒంట్లో ఉండే కొవ్వుని కూడా కరిగించగలదు. వేపాకుల్ని ఎక్కువ తీసుకుంటే, కడుపులో వికారం, మంట రావచ్చు. కాబట్టి మరీ ఎక్కువగా తీసుకోకండి. ఖాళీ కడుపుతో తింటే గుండెలో మంట, వికారం రావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Admin

Recent Posts